ఆంధ్రప్రదేశ్‌

కాపులు మళ్లీ ఉద్యమిస్తే ఆ బాధ్యత చంద్రబాబుదే : ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ప్రభుత్వ దూతలు ఇచ్చిన హామీలతో తాను దీక్ష విరమించానని, కాపులు మళ్లీ రోడ్కెక్కితే ఆ బాధ్యత సిఎం చంద్రబాబుదేనని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం ఆమరణ దీక్ష విరమించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుంటే మళ్లీ ఉద్యమిస్తాన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినా మిగతా బీసీ కులాలకు అన్యాయం జరగకూడదన్నదే తన అభిమతమన్నారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా వెయ్యి కోట్లు కేటాయించాలని, బీసీ కమిషన్ నివేదికను తొందరగా తెప్పించి కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో తాను ఆమరణ దీక్ష విరమించానని వివరించారు.