S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/10/2016 - 16:47

విజయవాడ-రాష్ట్రంలో ఉపాథి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని, ప్రతి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడలో ఆయన అధికారులతో మాట్లాడారు. హుదుద్ తుపాను ప్రభావంనుంచి వేగంగా కోలుకున్న విశాఖ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు వేదికగా తయారవం గొప్ప విషయమని ఆయన అన్నారు.

02/10/2016 - 11:51

విశాఖ: విశాఖలోని పరవాడ వద్ద రాంకీ ఫార్మాసిటీలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

02/10/2016 - 11:48

విజయవాడ: కులాల ప్రస్తావన లేకుండా పేదవాళ్లందరికీ విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రవితేజ అనే విద్యార్థి బుధవారం ఇక్కడి గుణదలలో సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. దీంతో అతడిని కిందికి దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడాకే తాను కిందికి దిగుతానని రవితేజ సెల్‌టవర్ నుంచి ఓ లేఖను కిందకు పడేశాడు.

02/10/2016 - 11:45

కడప: రైల్వేకోడూరు మండలం బాలపల్లె వద్ద బుధవారం ఉదయం అటవీ శాఖ అధికారులు తనిఖీలు జరిపి ఓ కంటైనర్‌లో తరలిస్తున్న కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ సిబ్బందిని చూసి దొంగలు వాహనాన్ని వదిలి పరారయ్యారు.

02/10/2016 - 06:56

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే లేపాక్షి ఉత్సవాలకు హాజరు కావాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం సచివాలయంలో తెలంగాణ మంత్రి చందులాల్‌ను కలిసి ఆహ్వానించారు. బాలకృష్ణ.. చందులాల్ చాంబర్‌కు వచ్చి ఆయనతో భేటీ అయ్యారు.

02/10/2016 - 01:12

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ ఆర్ధిక పరిస్థితి దిగజారుతోంది. కేంద్రం సకాలంలో ఆదుకుంటుందున్న ఆశలు రోజురోజుకూ అడుగంటడంతో జీతాలకు సైతం వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. తక్షణం నాలుగైదు వేల కోట్లను కేటాయిస్తే వాటిని ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటామనే ధోరణిలో రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది.

02/10/2016 - 01:08

విశాఖపట్నం: విశాఖలో నాలుగు రోజులపాటు జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మంగళవారం లాంఛనంగా ముగిసింది. వివిధ దేశాల నుంచి వచ్చిన యుద్ధనౌకలకు నౌకాదళ సంప్రదాయ రీతుల్లో వీడ్కోలు పలకడంతో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) ముగిసినట్టయింది. విశాఖ తీరానికి సుమారు 100 కిలో మీటర్ల దూరంలో ఈ వీడ్కోలు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.

02/10/2016 - 01:03

రాజమహేంద్రవరం: గోదావరి డెల్టాలో రబీ గట్టెక్కాలంటే ఇంకా పది టిఎంసిలు నీటిని అదనంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మార్చి 31నాటికి రబీని ముగించాలని జలవనరులశాఖ అధికారులు ఎంత మొత్తుకున్నా ఏప్రిల్ నెలాఖరు వరకు రబీ సా..గేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో 10టిఎంసిలు నీటిని అదనంగా బలిమెల రిజర్వాయరు నుండి తెచ్చుకుంటే తప్ప రబీ గట్టెక్కే పరిస్థితి కనిపించటం లేదు.

02/09/2016 - 11:59

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ఎ.పి. సి.ఎం. చంద్రబాబు మంగళవారం ఉదయం బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై రాబోయే పార్లమెంటు సమావేశాలలో ఎన్‌డిఏ పక్షం అవలంబించాల్సిన విధానాలపై చర్చించారు. చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని, సాయంత్రం నితిన్ గడ్కరీ, ప్రధాని మోదీలను కలుస్తారు.

Pages