S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/13/2016 - 12:21

అనంతపురం: హిందూపురంలోని ఎంజిఎం మైదానంలో శనివారం ఉదయం అయుత చండీయాగం ఘనంగా ప్రారంభమయింది. స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ యాగానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు.

02/13/2016 - 12:21

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శనివారం విజరుూభవ సరస్వతీ యాగాన్ని పండితులు నిర్వహించారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు.

02/13/2016 - 02:34

విజయవాడ, ఫిబ్రవరి 12: ప్రస్తుత సీజన్‌లో పత్తి విత్తనాలకు తీవ్రమైన కొరత ఏర్పడగలదని రెండు రాష్ట్రాల్లోని పత్తిరైతులు ఆందోళన చెందుతున్నారు.

02/13/2016 - 02:34

తిరుమల, ఫిబ్రవరి 12: టిటిడి దర్శన టికెట్లను బ్లాక్‌లో విక్రయించిన ఓ దళారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఈ వ్యవహారం బట్టబయలైంది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తన సమీప బంధువైన నవ వధూవరులతో శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.

02/13/2016 - 02:33

తిరుమల, ఫిబ్రవరి 12: వివాహాది శుభకార్యాలకు ఈనెల 14 నుంచి ముహూర్తాలు ఉండటంతో తిరుమల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరుగనున్నాయి. ఈక్రమంలో శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో వసతి కొరత ఏర్పడింది. గంటల తరబడి వేచివున్నా గదులు దొరక్క పోవడంతో ఇబ్బందులు పడుతున్న భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు.

02/13/2016 - 02:33

హిందూపురం, ఫిబ్రవరి 12: లేపాక్షి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. లేపాక్షికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఉత్సవాలు నిర్వహిస్తామని,తెలిపారు. లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం టూరిజం అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో బాలకృష్ణ శుక్రవారం సమీక్షించారు.

02/13/2016 - 02:33

సింహాచలం, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై భారీ ఎత్తున పోరాటం చేయడానికి అన్ని కార్మిక సంఘాలను ఏకం చేస్తున్నట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి స్పష్టం చేశారు. పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 10వ తేదీన కార్మిక వ్యతిరేక దినంగా పాటించాలని, ఏప్రిల్‌లో రెండు రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.

02/13/2016 - 02:32

గుంటూరు, ఫిబ్రవరి 12: తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు తమ పార్టీలో చేరేందుకు టచ్‌లో ఉన్నారని వైస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు వెల్లడించారు.

02/13/2016 - 02:31

విజయవాడ, ఫిబ్రవరి 12: కాపులను బిసిలుగా గుర్తించే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా బిసి సంఘాలు రాష్ట్ర రాజధాని విజయవాడ కేంద్రంగా ఉద్యమాలకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ముస్లిం నేతలు మహాగర్జన నిర్వహణకు సమాయత్తమవుతున్నారు.

02/13/2016 - 02:30

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 12: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో పోలీసు కస్టడీలో కాపు యువకుడు బొప్పన పరిపూర్ణచంద్రరావు మృతికి కారకులైన వారందరిపై కఠినచర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండుచేశారు. ఆటో డ్రైవర్ బొప్పన పరిపూర్ణచంద్రరావును పోలీసులే కొట్టిచంపారని కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలను పరిగణనలోనికి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Pages