S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/15/2016 - 02:18

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఆంధ్ర డిస్కాంలు, జెన్కో, ట్రాన్స్‌కో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.783 కోట్ల విద్యుత్ చార్జీల పెంపుదలపై ఇచ్చిన ప్రతిపాదనలపై ఏపిఇఆర్‌సి బహిరంగ విచారణను మార్చి 2వ తేదీ నుంచి నిర్వహించనుంది.

02/14/2016 - 21:27

శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో పలుచోట్ల ఆదివారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు నాలుగు సెకన్లపాటు భూప్రకంపనలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు.

02/14/2016 - 18:36

తిరుమల:రథసప్తమి సందర్భంగా తిరుమలలో శ్రీవారు మాడ వీధుల్లో తిరువీధికి వచ్చారు. సర్వభూపాల వాహనంపై ఉభయదేవేరిలతో శ్రీవారి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు విహరిస్తారు.

02/14/2016 - 17:59

శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా అరసవల్లి భక్తులతో కిటకిటలాడింది. రథసప్తమి కావడంతో సూర్యనారాయణుడిని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.సాయంత్రంవరకూ కూడా భక్తుల రద్దీ కొనసాగింది.

02/14/2016 - 17:13

శ్రీకాకుళం:జిల్లాలోని పాలకొండ మండలం సిరికొండవద్ద ఆర్టీసి బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

02/14/2016 - 08:40

శ్రీకాకుళం: రథ సప్తమి సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి జయంతి ఉత్సవం ఆదివారం జరగనుంది. మూలవిరాట్‌కు మహాభిషేకం నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆదిత్యుని దర్శించుకోనున్నారు.

02/14/2016 - 07:31

గుంటూరు: సున్నితమైన ఎస్సీ వర్గీకరణ అంశంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించేముందు ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించిన తర్వాత మాట్లాడితే బాగుండేదేమో అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. శనివారం గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

02/14/2016 - 07:29

రాజమహేంద్రవరం: మేధావులతో చర్చలు..నెలల తరబడి అధ్యయనాలు..మంత్రి ఉపసంఘం చర్చల ఫలితాలతో రూపొందించిన కొత్త ఇసుక విధానం బెడిసికొట్టేలా కనిపిస్తోంది.

02/14/2016 - 07:28

విశాఖపట్నం: ఈ ఏడాది దేశంలోను, రాష్ట్రంలోను విపరీత పరిస్థితులు నెలకొంటాయని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. శనితో కలిసి కుజుడు వృశ్చిక రాశిలో ఉండే ఎనిమిది నెలల కాలం పలు వైపరీత్యాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని పీఠంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.

02/14/2016 - 07:27

రాజమహేంద్రవరం:కాలువ గట్లపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటుచేయటం ద్వారా జూన్ నాటికి పశ్చిమగోదావరి జిల్లా లోని రెండు ప్రాంతాల నుండి ఆరు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిచేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాలువ గట్లపై ఇలా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తొలిసారి.

Pages