S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/16/2016 - 01:45

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని మద్యం అమ్మకాల వివరాలను ఈ నెలాఖరులోగా పూర్తిగా కంప్యూటరీకరిస్తామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మద్యం విక్రయాలకు సంబంధించిన వివిధ సమస్యలు ఈ విధానం వల్ల చాలా వరకూ పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

02/16/2016 - 01:45

గుంటూరు, ఫిబ్రవరి 15: రాజధాని అమరావతి ప్రతిపాదిత ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలు విస్తరించిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గ్రామకంఠాల పరిధి పెంచాలంటూ ఆ గ్రామాల రైతులు సోమవారం వినతిపత్రం అందజేశారు. తుళ్లూరు సిఆర్‌డిఎ ప్రాంతీయ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌లో పలువురు తమ వినతిపత్రాలను అధికారులకు అందించారు. సిఆర్‌డిఎ అధికారులు గ్రామకంఠాల విస్తీర్ణం పెంచాలంటూ ఇప్పటికే అనేకసార్లు కోరామన్నారు.

02/16/2016 - 01:44

విజయవాడ, ఫిబ్రవరి 15: ముఖ్యమంత్రి కార్యాలయానికి సోమవారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను తెలియజేసి సహాయం పొందటానికి బారులుతీరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారి సమస్యలను సావధానంగా విని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి 18 సంవత్సరాల యువకుడు సిహెచ్ నవీన్ వచ్చి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపాడు.

02/16/2016 - 01:43

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని జైళ్లను ఆధునికీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జైళ్లను ఆధునిక జైళ్లుగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలు ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌లోని జైళ్ల శాఖ సిబ్బందికి రెండు రోజుల పునశ్చరణ తరగతులను సోమవారం ఆయన ప్రారంభించారు.

02/16/2016 - 01:43

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: వాద్యకారులకు విదేశాల్లో ఆదరణ పెరుగుతుంటే, మన దేశంలో తగ్గిందని కళామామణి, సంగీత కళాకారిణి, పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఎయు సంగీత విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగీతానికి ఎంతో శక్తి ఉందని, వ్యాధులను కూడా నయం చేసే శక్తి ఉందన్నారు.

02/16/2016 - 01:42

నెల్లూరు, ఫిబ్రవరి 15: హైదరాబాద్ నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ చార్మినార్, నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేలు సోమవారం నెల్లూరు జిల్లా ఎఎస్పీ రెడ్డి గంగాధర్‌ను కలిశారు. ఇటీవల నగరంలో ఎస్‌పి ముస్లింల మనోభావాలను కించపరిచారనే భావోద్వేగ సంఘటనల గురించి వారి మధ్య చర్చ జరిగింది.

02/16/2016 - 01:42

సింహాచలం, ఫిబ్రవరి 15 : సింహాచలం దేవస్థానం కేశఖండన శాలలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారికి భక్తులు మొక్కుల రూపంలో చెల్లించిన తలనీలాలను దొంగలు అపహరించుకుపోయారు. సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే 150 కిలోల బరువు గల పది మూటలను దొంగలు అపహరించుకుపోయినట్టు దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తెలియజేశారు.

02/16/2016 - 01:41

విజయవాడ, ఫిబ్రవరి 15: 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ. 4 కోట్ల 66 లక్షల 56వేల డివిడెండ్‌ను ఏపి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. సోమవారం మధ్యాహ్నం సిఎంవోలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కార్పొరేషన్ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు.

02/15/2016 - 19:17

విజయవాడ: రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా ఎక్కువ వసూలు చేయకుండా ఇసుక విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. క్యూబిక్ మీటర్‌కు రూ.500 రూపాయలుగా నిర్ణయించిన ధర అమలవ్వాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావించింది. విజయవాడలో సుదీర్ఘంగా సాగుతున్న కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

02/15/2016 - 18:05

విజయవాడ:సియాచిన్‌లో మంచు శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వీరజవాను ముస్తాక్‌కు ఏపి మంత్రిమండలి నివాళి అర్పించింది. సోమవారంనాడు ఇక్కడ భేటి అయిన మంత్రివర్గం సియాచిన్ సంఘటనపై చర్చించింది. ముస్తాక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఆయన కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

Pages