S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/18/2016 - 11:51

అనంతపురం: పట్టణంలోని రాంనగర్ సమీపంలో గురువారం ఉదయం రైలు కిందపడి అరుణ్ అనే పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

02/18/2016 - 11:51

ఏలూరు: అగ్రిగోల్డ్ కేసులో ఆ సంస్థ వైస్‌ఛైర్మన్ సదాశివ వరప్రసాద్, ఎం.డి. రామిరెడ్డి, రామచందర్‌రావు, డైరెక్టర్ అహ్మద్ ఖాన్‌లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏలూరు కోర్టులో హాజరు పరిచారు.

02/18/2016 - 11:50

తిరుపతి: అలిపిరి నడక దారిలో గురువారం ఉదయం ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులను లూయా ఆస్పత్రికి తరలించారు.

02/18/2016 - 08:19

కాకినాడ: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కాకినాడ రైల్వేలైన్‌ను మెయిన్‌లైన్‌గా అభివృద్ధిచేసే ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నదని తెలుస్తోం ది. ఈ నెలలో కేంద్ర రైల్వే శాఖ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇందుకు అవసరమైన నిధులను కేటాయించనున్నట్టు సమాచారం. ఇప్పటికే కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ సానుకూలతను వ్యక్తం చేసింది.

02/18/2016 - 07:25

చిత్తూరు : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు నిధుల కొరత లేదని రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం చిత్తూరు ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని ఆరోపించడంలో అర్థం లేదన్నారు.

02/18/2016 - 07:24

విజయవాడ: రాష్ట్ర విభజన తరువాత మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు కార్మిక శాఖ నిర్వహిస్తోంది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎనిమిది కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి. ఒకటి రాష్ట్ర స్థాయి, మరొకటి రీజియన్ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి.

02/18/2016 - 07:23

విజయవాడ: విజయవాడకు సమీపంలో 200 ఎకరాల్లో మోడల్ ఇండస్ట్రీయల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. వౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం, కార్మికులకు గృహ వసతి ఒకేచోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఇండస్ట్రీయల్ టౌన్‌షిప్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం భూమిని కేటాయించనుంది. గన్నవరం దగ్గరలోని వీరపనేనిగూడెంలో భూమిని గుర్తించింది.

02/18/2016 - 07:22

విశాఖపట్నం: చేసేది పోలీసు వృత్తి.. అవినీతి ఆయన ప్రవృత్తి. అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించిన సిఐ ఆస్తుల బండారం బయటపడింది. తనకున్న పలుకుబడితో సర్వీస్‌లో అధిక భాగాన్ని విశాఖ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సాగేలా సదరు సిఐ జాగ్రత్తపడ్డాడు.

02/18/2016 - 05:54

గుంటూరు: రాజధాని అమరావతిలో బుధవారం ఉదయం 8.23కు సిఎం చంద్రబాబు తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నల్లూరు పండితులు ధాతుస్థానం, రత్నాన్యాసం, ఇష్టికాన్యాసం తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. సిఎం చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి హారతిపట్టారు. అనంతరం నవధాన్యాలు, సిమెంటుతో శంకుస్థాపన కావించారు. వెలగపూడి కేంద్రంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

02/18/2016 - 05:53

గుంటూరు: సమస్యల పరిష్కార వేదికైన సచివాలయాన్ని త్వరితగతిన నిర్మించి సుపరిపాలన అందిస్తూ ప్రజా దేవాలయంగా తీర్చిదిద్దుతానని సిఎం చంద్రబాబు హామీఇచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బుధవారం వెలగపూడి రెవెన్యూ గ్రామ పరిధిలో 45.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన తాత్కాలిక సచివాలయానికి సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

Pages