S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/19/2016 - 05:37

విశాఖపట్నం: మేక్ ఇన్ ఇండియా పథకంకింద కేంద్రం రాయితీలు కల్పిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2020 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

02/19/2016 - 05:19

గుంటూరు: ఆకాశంలో కట్టడాలు కట్టలేం... భూములు కావాలి.. అయితే దశాబ్ద కాలం అవినీతికి పాల్పడిన వారు అభివృద్ధికి అడ్డుపడుతూ ప్రజలను రెచ్చగొట్టేందుకు కొత్త నాటకాలు ఆడుతున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు.

02/18/2016 - 18:58

విశాఖ: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం సాయంత్రం ఇక్కడి కలెక్టర్ కార్యాలయంలో పోలీసు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలు, శాంతి భద్రతలు, వర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఆందోళనలు వంటి అంశాలను ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది. ఎపి హోం మంత్రి చినరాజప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, డిజిపి జెవి రాముడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

02/18/2016 - 18:57

గుంటూరు: అభివృద్ధిని అడ్డుకోవాలని ఏ శక్తులు అడ్డుపడ్డా తాను భయపడేది లేదని, ఎన్ని అవరోధాలు కల్పించినా బుల్లెట్‌లా దూసుకుపోతానని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. చిలకలూరిపేటలో పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులు ఉన్నందున తనను ఏ దుష్టశక్తులూ అడ్డుకోలేవన్నారు.

02/18/2016 - 15:50

గుంటూరు: చిలకలూరిపేట ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు ఎపి సిఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపనలు చేశారు. సుమారు 420 కోట్ల రూపాయల వ్యయంతో ప్రజలకు కనీస అవసరాలు తీరేలా పనులు చేపడతామని ఆయన ప్రకటించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు.

02/18/2016 - 15:49

విశాఖ: అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉండబోతోందని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. విశాఖలో ఆయన గురువారం ‘సమీర్’ (సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చి) పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఐటి రంగం ప్రగతికి కేంద్రం చేస్తున్న కృషిని ఆయన వివరించారు.

02/18/2016 - 13:05

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళకు చెందిన 4 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను దొంగలు చోరీ చేశారు. రాజమండ్రి నుంచి పెళ్లికి వచ్చిన లక్ష్మి అనే మహిళ విడిది గదిలో నిద్రించగా, ఆమె బ్యాగులో ఉన్న నగలు మాయమయ్యాయి. గురువారం ఉదయం బ్యాగును తెరిచి నగలు కనిపించకపోవడంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

02/18/2016 - 11:53

విజయవాడ: అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది హాజరుకు సంబంధించి త్వరలోనే బయోమెట్రిక్ విధానం ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో గురువారం ఉదయం ఆయన ఎ.పి. మెడికల్ కౌన్సిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. విశాఖలో మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ విభాగానికి ఏప్రిల్ 7న భూమి పూజ జరుగుతుందని ఆయన తెలిపారు.

02/18/2016 - 11:52

విజయవాడ: ఎ.పి.ఎస్. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 126 డిపోల్లో గురువారం ఉదయం 5 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్‌ఎంయు, ఎంప్లారుూస్ యూనియన్ మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ కార్మిక పరిషత్ కూడా రంగంలో నిలిచింది. 56వేల మంది కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకో నున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

02/18/2016 - 11:51

అనంతపురం: యాడికి గ్రామంలో ఓ ఇంట్లో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో గాయపడిన తండ్రి, కూతురిని ఆస్పత్రికి తరలించారు.

Pages