ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు ఎఎస్పీతో ఎంఐఎం ఎమ్మెల్యేల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 15: హైదరాబాద్ నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ చార్మినార్, నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేలు సోమవారం నెల్లూరు జిల్లా ఎఎస్పీ రెడ్డి గంగాధర్‌ను కలిశారు. ఇటీవల నగరంలో ఎస్‌పి ముస్లింల మనోభావాలను కించపరిచారనే భావోద్వేగ సంఘటనల గురించి వారి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రి, జాఫర్ హుస్సేన్ విలేఖరులతో మాట్లాడుతూ నగరంలో ఇటీవల జిల్లా ఎస్పీ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యం, అనంతర ఘటనల గురించి జిల్లా ఎఎస్పీ నుంచి వివరాలు సేకరించామన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు తాము ఇక్కడకు వచ్చినట్లు వారు వెల్లడించారు. ముస్లిం మతపెద్దలతోనూ నాటి సంఘటనల గురించి వాకబు చేశామన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీని కూడా తమ పార్టీ తరపున కలిసి తగు చర్యల నిమిత్తం కోరామన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ జరగుతోందనీ, ప్రభుత్వ నివేదిక రాగానే తమ పార్టీ ప్రతిస్పందన తెలుపుతామన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వీరి వెంట ఎం ఐ ఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు తదితరులు ఉన్నారు.