ఆంధ్రప్రదేశ్‌

ఏపి గిడ్డంగుల సంస్థ డివిడెండ్రూ.4.66కోట్లు సిఎంకు అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ. 4 కోట్ల 66 లక్షల 56వేల డివిడెండ్‌ను ఏపి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. సోమవారం మధ్యాహ్నం సిఎంవోలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కార్పొరేషన్ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఆర్ సుకుమార్‌తో కలిసి సిఎంను కలిసిన చైర్మన్ ప్రసాద్ కార్పొరేషన్ అభివృద్ధి ప్రణాళికల గురించి వివరించారు. సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ఈసందర్భంగా ముఖ్యమంత్రి పాలకవర్గాన్ని అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇటీవలే కార్పొరేషన్ రూ.1.40కోట్లు అందించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రైతులకు గోదాములను అందుబాటులోకి తెస్తున్నట్లు చైర్మన్ ప్రసాద్ వివరించారు. రాష్ట్రంలోని గడ్డంగుల స్థాయి పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో హౌసింగ్ గోదాములు ఉన్నాయని, అదనంగా మరో రెండు లక్షల సామర్థ్యంతో గోదాములు నిర్మించనున్నట్లు తెలిపారు. గోదాముల పైకప్పులపై సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు కూడా ఆయన వివరించారు.