ఆంధ్రప్రదేశ్‌

పట్టాలెక్కిన రత్నాచల్ (తునిలో రైలుకు దండలు వేసిన స్థానికులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని: కాపుల ఉద్యమం కారణంగా వారంపాటు ప్రయాణికులకు దూరమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. సోమవారం నుంచి విశాఖపట్నం- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (నెం.12717) ప్రయాణం మొదలైంది. గతనెల 31న తూర్పు గోదావరి జిల్లా తునివద్ద కాపు ఐక్యగర్జన సందర్భంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.
విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న రైలుకు నిప్పు పెట్టడంతో కొన్ని బోగీలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఇంజను బాగానే ఉన్నప్పటికీ బోగీలులేక అప్పటి నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే అధికార్లు నిలిపివేశారు. సోమవారం మళ్లీ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను 17బోగీలతో విశాఖ నుంచి విజయవాడ పంపించారు. తుని రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రైలుకు స్థానికులు, ప్రయాణికులు దండలువేసి స్వాగతం పలికారు. డ్రైవర్లకు అభినందనలు తెలిపారు. స్టేషన్‌లోని పక్క ట్రాక్‌పైనే తగలబడిన రైలు బోగీలు నిలిపివుండగా, కొత్త రైలు స్టేషన్‌లోకి రావడం విశేషం. 1994లో ప్రారంభమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు 24 బోగీలు ఉండేవి.

చిత్రం... తుని రైల్వే స్టేషన్‌లో
దండలు వేసిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్