ఆంధ్రప్రదేశ్‌

దీక్ష విరమణ .. పోరు ముగించిన ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ దౌత్యం ఫలించడంతో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు సోమవారం మధ్యాహ్నం ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. ఉత్కంఠ భరిత వాతావరణంలో జరిగిన చర్చల అనంతరం ముద్రగడ దంపతులకు ఏపీ తెదేపా అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మరసమిచ్చి, దీక్ష విరమింపజేశారు. తన డిమాండ్ల విషయంలో సిఎం చంద్రబాబు ఒక మెట్టు దిగడంతో తాను రెండు మెట్లు దిగినట్టు ఈ సందర్భంగా ముద్రగడ ప్రకటించారు.
నాలుగో రోజైన సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రతినిధి బృందంగా అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, ఎస్‌విఎస్‌ఎస్ వర్మ, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఆమరణ దీక్షలో ఉన్న ముద్రగడ నివాసానికి చేరుకుంది. సుమారు గంటన్నరపాటు బృందంలోని సభ్యులు ముద్రగడతో చర్చలు జరిపారు. అనంతరం చర్చలు ఫలించాయని, ముద్రగడ దంపతులు దీక్ష విరమిస్తున్నారని ప్రకటించారు. దీనితో ముద్రగడ వైద్య పరీక్షలకు అంగీకరించారు. వెంటనే అక్కడే వేచివున్న వైద్యుల బృందం పరీక్షలు జరిపి అవసరమైన చికిత్స ప్రారంభించారు. ప్రతినిధి బృందంలోని కిమిడి, అచ్చెన్నాయుడు ముద్రగడ పద్మనాభానికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ముద్రగడ సతీమణి పద్మావతికి, కాపునాడు నేత ఆకుల రామకృష్ణకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
ఆదివారం అర్థరాత్రే సానుకూలం
దీక్ష విరమణకు సంబంధించి ఆదివారం అర్థరాత్రి దాటాక సానుకూల సంకేతాలు లభించాయి. అర్థరాత్రి 12 గంటల సమయంలో ముద్రగడ ఇంటికొచ్చిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు సుమారు అర్ధగంట ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన వారు సోమవారం ఉదయం కిమిడి, అచ్చెన్నాయుడు వస్తారని, ఆందోళన సామరస్యపూర్వకంగా ముగుస్తుందని ప్రకటించి వెళ్లారు. అదేవిధంగా సోమవారం మధ్యాహ్నానికి వచ్చిన ప్రతినిధి బృందం జరిపిన చర్చల అనంతరం ఆందోళనకు ముగింపు పలికారు.

చిత్రం... ముద్రగడకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేస్తున్న మంత్రులు కిమిడి, అచ్చెన్నాయుడు