S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/30/2016 - 13:58

హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వైకాపా అధినేత జగన్‌ శనివారం మీడియాతో చెప్పారు. ప్రత్యేక హోదాపై భాజపా కుంటిసాకులు చెబుతోందని విమర్శించారు. చంద్రబాబు, భాజపా నేతలు ఐదుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

07/30/2016 - 12:04

ఏలూరు: ఆరంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మరణించిన ఘటన పెరవలి వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. హైవేపై పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎఎస్‌ఐ ధన్‌రాజ్ బైక్‌పై వెళుతుండగా ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఎఎస్‌ఐ అక్కడికక్కడే మరణించాడు. ధన్‌రాజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

07/30/2016 - 12:03

ఒంగోలు: మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం వద్ద శనివారం ఉదయం ఓ కారును ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. కారులో వెళుతున్న వారిలో ఇద్దరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు.

07/30/2016 - 12:03

కాకినాడ: తమ గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న ఆగ్రహంతో ఓ చర్చి ఫాదర్‌ను గొంతు కోసి మావోయిస్టులు హతమార్చిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామంలోకి అర్ధరాత్రి సమయంలో సుమారు 200 మంది మావోయిస్టులు ప్రవేశించారు. చర్చి ఫాదర్ మారయ్యను వారు కొంత దూరం తీసుకుపోయి గొంతు కోసి చంపేశారు.

07/30/2016 - 07:20

హైదరాబాద్, జూలై 29: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ పరుచూరి దినేష్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ రంగం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తిచేసేందుకు అందరి సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు.

07/30/2016 - 07:20

హైదరాబాద్, జూలై 29:ప్రత్యేక హోదా అంశంలో ఏపి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బిజెపిపై ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తుతున్నారు. రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న యత్నాలకు హోదాతో బ్రేకులు వేసి ఆ పార్టీని బలహీనపరచడం, తాము మిత్రపక్షమైనా కేంద్రంతో పోరాడుతున్నామన్న సంకేతాలివ్వడం ద్వారా పూర్తి రక్షణాత్మక వ్యూహాన్ని అనుసరించాలని టిడిపి నిర్ణయించుకుంది.

07/30/2016 - 07:19

విజయవాడ, జూలై 29:ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ నేతలను మొక్కలు నాటే దిశగా ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలు ప్రకటించారు. మొక్కలు నాటిన విద్యార్థులకు ఐదు గ్రేస్ మార్కులు కలుపుతామని, ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీల విషయంలో ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు విరివిగా మొక్కలు నాటితే టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామన్నారు.

07/30/2016 - 08:21

హైదరాబాద్, జూలై 29: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ వైఖరికి, బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న టిడిపి ధోరణికి నిరసనగా ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను బిజెపి మోసం చేసిందని, కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కై పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజన తంతును పూర్తిచేశాయని ఆయన ధ్వజమెత్తారు.

07/30/2016 - 07:16

హైదరాబాద్, జూలై 29: రాష్ట్రంలో 6(ఎ) కేటగిరీకి చెందిన ఆలయాల్లోని అర్చకులకు బయోమెట్రిక్ విదానం ద్వారా హాజరు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఖండించింది. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు దేవాదాయ కమిషనర్‌ను డిమాండ్ చేశారు.

07/30/2016 - 07:15

హైదరాబాద్, జూలై 29: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై శుక్రవారం నాటి రాజ్యసభ హోదా చర్చలో కాంగ్రెస్ పార్టీ మైలేజీ సాధించడాన్ని తెదేపా అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. హోదాపై కేంద్రవైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ముందుగనే వాకౌట్ చేసి మైలేజీ సాధించగా, తమ పార్టీ ఎంపీలు వౌనంగా కూర్చోవడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages