S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/29/2016 - 05:41

తనకల్లు, జూలై 28: అనంతపురం జిల్లాలో గురువారం సంచారజాతి వారి మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ రెండు ప్రాణాలను బలిగొంది. డబ్బు విషయమై మాటామాటా పెరగడంతో తండ్రీకొడుకులు గుర్రప్ప, కొట్రసిని చావగొట్టారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కాశీపురానికి చెందిన కొంతమంది సంచారజాతి వారు కొక్కంటి క్రాస్ వద్ద గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

07/29/2016 - 05:41

విజయవాడ, జూలై 28: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రక్షణ దళం త్వరలోనే రాజధాని ప్రాంతంలో రక్షణ బాధ్యతలను స్వీకరించనుంది. తొలుత 400 మంది సిబ్బంది సచివాలయం ప్రాంగణంలో విధులు చేపట్టనున్నారు.

07/29/2016 - 05:40

డి.హీరేహాల్, జూలై 28 : కడప జిల్లా నుంచి బళ్ళారి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అనంతపురం జిల్లా పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. డి.హీరేహాల్ మండలం ఓబుళాపురం చెక్‌పోస్టు వద్ద లారీలో తరలిస్తున్న 120 ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు 20 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు.

07/28/2016 - 18:13

విజయవాడ: ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సర్వే తీరుతెన్నులపై ముఖ్యమంత్రి గురువారం తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సేకరించిన సమాచారం కచ్చితత్వాన్ని సరిచూసుకోవాలన్నారు.

07/28/2016 - 17:20

హైదరాబాద్‌: ఏపీ ఎంసెట్‌ మెడికల్‌ పేపర్ బహిర్గతం కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ గురువారం వెల్లడించారు. ఆగస్టు 6, 7, 8 తేదీల్లో మెడికల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు వైకాపా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తోందన్నారు.

07/28/2016 - 16:38

ర్నూలు: శ్రీశైలం నుంచి 10 టీఎంసీలను వదలడం రాయలసీమ వాసుల గొంతుకోయడమే అని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డిరాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం జలదోపిడీపై త్వరలో దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. కృష్ణా బోర్డు నిర్ణయాలు సీమకు ఉరితాళ్లుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు.

07/28/2016 - 16:27

హైదరాబాద్: డిఎడ్ విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున లంచం పుచ్చుకుంటుండగా ఎపి ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌ను గురువారం నాడు ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

07/28/2016 - 12:23

అనంతపురం: వివిధ ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు ధర్మవరంలో గురువారం అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 16లక్షల రూపాయలు విలువచేసే 34 బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

07/28/2016 - 12:15

విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. తెలంగాణ, కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

07/28/2016 - 06:03

హైదరాబాద్, జూలై 27: రెండోసారీ రాయలసీమలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహించడంద్వారా ఆ ప్రాంతంలో తన ప్రభుత్వంపై సీమ వస్తున్న అసంతృప్తిని తొలగించే ఎత్తుగడకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు.

Pages