S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/28/2016 - 05:52

విజయవాడ, జూలై 27: ఏపిలో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఈసారి ఆశించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలో మూడు జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతాలు నమోదవ్వడం విశేషం. ఇలాగే వరుణుడు సహకరిస్తే, బంగారు సిరులు కురిపిస్తామంటున్నారు అన్న దాతలు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లోనూ ఒకట్రెండు జిల్లాలు మినహా భారీ వర్షాలు నమోదయ్యాయి.

07/28/2016 - 05:51

గుంటూరు, జూలై 27: కావేరి సీడ్స్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే కేసులు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు నాసిరకం విత్తనాలపై సంస్థ యాజమాన్యం స్పందించక పోవడంతో అనుమానాలు బలపడుతున్నాయన్నారు.

07/28/2016 - 05:57

విజయవాడ, జూలై 27: ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన డ్వాక్రా సంఘాల ఉత్పత్తులు ఇకపై రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నాయి. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయి.ఈ కామర్స్ వెబ్‌సైట్లతో ఆన్‌లైన్ వ్యాపారం విస్తరించాక, ప్రపంచంలోని ఏ మూలన ఉండే ఉత్పత్తులైనా..

07/28/2016 - 03:31

విజయవాడ, జూలై 27: రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక సమాచారం మొత్తం డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించి రూపొందిస్తున్న ల్యాండ్‌హబ్‌లో సమస్త భూముల వివరాలు పొందుపరచాలని సూచించారు. సిఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి రెవెన్యూ సంస్కరణలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు కొన్ని సూచనలు చేశారు.

07/28/2016 - 03:46

విజయవాడ, జూలై 27: ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలుపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ రామవరప్పాడు రింగ్ లో రూ.122 కోట్లతో నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డును బుధవారం ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరాన్ని పూర్తిగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సిఎం చెప్పారు. గత విజయవాడకు, భవిష్యత్ విజయవాడకు చాలా తేడా ఉంటుందని ఆయన తెలియచేశారు.

07/28/2016 - 03:21

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) కమిషనర్‌గా పనిచేస్తున్న నాగులాపల్లి శ్రీకాంత్‌ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యదర్శి(పొలిటికల్)లో నియమించింది. శ్రీకాంత్ స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ డాక్టర్ సి శ్రీ్ధర్‌ను నియమించింది.

07/27/2016 - 18:14

గుంటూరు: సినిమా ప్రదర్శిస్తుండగా మంటలు చెలరేగి థియేటర్ పూర్తిగా కాలిపోయిన సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో బుధవారం జరిగింది. మంటలు వ్యాపించిన వెంటనే సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా సురక్షితంగా బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శకటం వచ్చేలోగా థియేటర్ సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. థియేటర్ కాలిపోవడంతో మూడు కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని యాజమాన్యం చెబుతోంది.

07/27/2016 - 18:13

కడప: కడప జిల్లా పోలీసులు బుధవారం ఇద్దరు పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 26 దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. సినీనటి నీతూ అగర్వాల్ భర్త, కర్నూలు జిల్లాకు చెందిన స్మగ్లర్ మస్తాన్‌వలీని, చిత్తూరు జిల్లాకు చెందిన మరో బడా స్మగ్లర్ భాస్కర్‌ను అరెస్టు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లతో ఈ ఇద్దరికీ సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

07/27/2016 - 17:43

విజయవాడ: సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ బదిలీ అయ్యారు. నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా శ్రీకాంత్‌, సీఆర్డీఏ కమిషనర్‌గా గుంటూరు జేసీ శ్రీధర్‌, విశాఖ ఈపీడీసీఎల్‌ సీఎండీగా ఎంఎం నాయక్‌, విజయనగరం కలెక్టర్‌గా వివేక్‌ యాదవ్‌ను బదిలీ చేశారు.

07/27/2016 - 14:21

తిరుమల: తిరుమలలో శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పించే మొబైల్‌ హుండీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన అర్జున్‌ అనే వ్యక్తి రూ.50వేలు కాజేశాడు . నిందితుడిని తిరుమల క్రైం పోలీసులకు అప్పగించారు. సీసీ కెమెరాల ద్వారా చోరీని గుర్తించిన తితిదే విజెలెన్స్‌ విభాగం అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.

Pages