S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/26/2016 - 03:20

విజయవాడ, జూలై 25: రానున్న కృష్ణా పుష్కరాలతో రాష్టమ్రంతటా ఉత్సవ వాతావరణం కనిపిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నగరంలోని సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి కృష్ణా పుష్కరాల కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పనె్నండు రోజులు నిర్వహించే కృష్ణా పుష్కరాల్లో ప్రతీరోజు ఒక పండుగ గుర్తుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

07/26/2016 - 02:42

విజయవాడ, జూలై 25: వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన పనులు ఊపందుకున్నాయి. నిన్నమొన్నటి వరకూ మొండి గోడలతో కనిపించిన సెక్రటేరియట్ ఇప్పుడు కొత్త లుక్కుతో కనిపిస్తోంది. కార్పొరేట్ కార్యాలయ భవనాన్ని తలపించేలా ఉంది. సెక్రటేరియట్‌లో ఇంటీరియల్ డెకరేషన్ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఫ్లోరింగ్ పని కూడా చాలావరకూ పూర్తయింది.

07/26/2016 - 02:34

విశాఖపట్నం, జూలై 25: రాష్ట్రంలో నైరుతి రుతుపనాలు చుర్గుగా ఉన్నాయి. దీనికి తోడు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురియవచ్చని తెలిపారు.

07/26/2016 - 02:33

విజయవాడ, జూలై 25: పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన వైద్య పరికరాలతో పాటు మొబైల్ బృందాలు, అంబులెన్స్ సౌకర్యం, ఘాట్లలో భక్తులకు సూచనలను చేసే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. వైద్య సిబ్బందికి బ్లూస్కర్టు, వైట్ స్కార్ప్‌తో ప్రత్యేకమైన డ్రెస్‌కోడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

07/26/2016 - 02:33

శ్రీకాకుళం, జూలై 25: ఎపిని పరిశ్రమల హబ్‌గా తయారు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉపాధి, కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం ఇక్కడ మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకుగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ అందజేస్తున్నామన్నారు.

07/26/2016 - 02:32

విజయవాడ, జూలై 25: పట్టిసీమ పథకం 13వ మోటార్ పంపు సోమవారం నుండి పని ప్రారంభించింది. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం మాట్లాడుతూ 13 పంపుల ద్వారా రోజుకు 4600 క్యూసెక్కుల గోదావరి నీరు కృష్ణా బ్యారేజీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి రోజుకు 4వేల క్యూసెక్కుల నీటిని ఆయా కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లిస్తున్నట్లు చెప్పారు.

07/26/2016 - 02:32

విజయవాడ, జూలై 25: తెలంగాణ రాష్ట్రంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకున్న నిర్వాసితులపై ప్రభుత్వం నిరంకుశంగా దాడులకు పాల్పడటం అన్యాయమని, ఈ దాడుల్లో 28 మంది తీవ్రంగా గాయపడగా, ఒక మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన ప్రజల్ని అదుపు చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.

07/26/2016 - 02:32

ఒంగోలు,జూలై 25:ప్రకాశం జిల్లా చీరాల రాజకీయం మరోకసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే ఆమంచి, సునీత వర్గీయుల మధ్య ఇప్పటికీ పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. ఇలాంటి తరుణంలో జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయం కమిటీ సమావేశం తీరు దానికి ఆజ్యం పోసినట్టయింది. సోమవారం స్ధానిక పాలకేంద్రం ఆవరణలో జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయకమిటీ సమావేశం పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధ్యక్షతన జరిగింది.

07/26/2016 - 02:31

విశాఖపట్నం, జూలై 25: తగినంత సంఖ్యలో ప్రవేశాలు లేకపోవడంతో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. మూసివేతకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది 15 కళాశాలలు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ)కు దరఖాస్తు చేయడం గమనార్హం. దీనికి తోడు కొన్ని విభాగాలను మూసివేతకు అనుమతించాలని కోరుతూ కొన్ని కళాశాలలు దరఖాస్తు చేశాయి.

07/26/2016 - 02:30

విజయవాడ, జూలై 25: రాష్ట్రంలో ఈ ఏడాది స్థిరమైన రెండంకెల వృద్ధి రేటు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించింది. 2022 నాటికి ఏపిని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపేందుకు, అన్ని రంగాల్లో సమ్మిళిత వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఏడు మిషన్లను తీసుకున్న విషయం తెలిసిందే.

Pages