ఆంధ్రప్రదేశ్‌

12 రోజులూ పండగే పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: రానున్న కృష్ణా పుష్కరాలతో రాష్టమ్రంతటా ఉత్సవ వాతావరణం కనిపిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నగరంలోని సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి కృష్ణా పుష్కరాల కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పనె్నండు రోజులు నిర్వహించే కృష్ణా పుష్కరాల్లో ప్రతీరోజు ఒక పండుగ గుర్తుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే పుష్కరాల పనులు, ఏర్పాట్లు, కార్యక్రమాలపై చర్చాగోష్ఠులు నిర్వహించాలన్నారు. పుష్కరాలకు ఆధ్యాత్మిక గురువులకు ఆహ్వానాలను పంపించాలన్నారు. నదులకు, మనకు మధ్య వున్న అవినాభావ సంబంధాలను గుర్తుచేసుకుని మన సంప్రదాయాలు, సంస్కృతి గురించి దశదిశలా చాటేలా పుష్కరాలను నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెద్దఎత్తున నిర్వహిస్తున్న నదుల అనుసంధానం, వనం - మనం వంటి ప్రజా ఉద్యమాలకు ఈ పుష్కరాల్లోనే ఊపు తెచ్చేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వివిధ అంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. పుష్కరాలకు 72 గంటలకు ముందే విధులకు హాజరయ్యే అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు రిపోర్టు చేసేలా చూడాలని, వారం ముందే రిహార్సల్స్ వేసుకోవాలన్నారు. పుష్కరాల్లో ఒక్కోరోజు ఒక్కో ఆధ్యాత్మిక గురువును పిలిపించి ఆయా రోజులకు మరింత పవిత్రత, వనె్న తేవాలని సూచించారు. ఏ కార్యక్రమాల్ని ఎవరెవరు నిర్వహించాలో ముందే రోల్ క్లారిటీ వుండేలా ప్రాసెస్ ఛార్టు రూపొందించుకోవాలన్నారు. పుష్కరాలకు ఎవరి పనులు ఎంతవరకు వచ్చాయో మంగళవారం నిర్వహించే విభాగాధిపతుల సమావేశంలో ఉన్నతాధికారులు ప్రజంటేషన్ ఇవ్వాలని, అక్కడ వారినుంచి వచ్చిన సూచనలతో తుది నిర్ణయాలు, మార్పులు చేర్పులు చేయాల్సి వుంటుందని చెప్పారు. పనె్నండు రోజుజూ అపూర్వమైన యాత్రాస్థలిగా మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జేసి స్థాయి అధికారులను పుష్కరాల పర్యవేక్షణకు ఎంపిక చేయాలని, సమర్ధులైన ఆర్డీవోలనైనా సరే దీనికి ఎంపిక చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పురపాలక మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. పుష్కర ఏర్పాట్లు సమీక్షిస్తున్న చంద్రబాబు