S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/27/2016 - 05:04

విజయవాడ, జూలై 26:ఏ పార్లమెంట్ సాక్షిగా తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారో, అదే పార్లమెంట్ సాక్షిగా ఏపికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను వెల్లడించేందుకు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిశితంగా విమర్శించారు.

07/27/2016 - 05:01

కడప, జూలై 26: వర్షానికి నానిన పాత మిద్దె కుప్పకూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట గ్రామపంచాయతీ ఉచ్చలవరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అంగంపల్లె చిన్నగురువయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించాడు.

07/27/2016 - 04:16

నంద్యాల టౌన్, జూలై 26: ద్విచక్ర వాహనానికి కారు తగిలించాడన్న కోపంతో ఓ డాక్టర్‌ను నలుగురు యువకులు రాళ్లతో కొట్టి చంపిన అమానుష కాండ వెలుగుచూసింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నంద్యాలకు చెందిన డాక్టర్ శైలేంద్రరెడ్డి (40) గాజులపల్లె పిహెచ్‌సిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు.

07/27/2016 - 04:14

విజయవాడ, జూలై 26: రాష్ట్రంలో రేషన్ షాపు డీలర్ల కమీషన్‌ను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు 20 రూపాయలు కమీషన్ చెల్లిస్తున్నారు. దీన్ని 70 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివలన ప్రభుత్వ ఖజానాపై 77 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం ఐదు వేల రూపాయలు కమీషన్ అందుకుంటున్న రేషన్ డీలర్లు ఇకపై ఎనిమిది వేల రూపాయల వరకూ అందుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

07/26/2016 - 18:44

విజయవాడ: కృష్ణా పుష్కరాల పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు మంత్రివర్గ సమావేశంలో లో కృష్ణా పుష్కరాలు, వనం-మనం కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ సాగింది. కృష్ణా పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల ఇవ్వకపోవడం సబబు కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ క్వింటాకు రూ.70 పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

07/26/2016 - 18:41

బెర్లిన్‌: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సమీపంలోని స్టెగ్లిట్జ్‌ ప్రాంతంలోని ఆస్పత్రిలోకి సాయుధుడైన దుండగుడు ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఓ వైద్యుడిపై దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

07/26/2016 - 16:40

విజయనగరం: పెళ్లికి అంగీకరించలేదని బ్లేడుతో ఓ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది విక్రమ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తనను ప్రేమిస్తూనే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ పెళ్లికి నిరాకరించినందుకే ఆ యువతిపై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

07/26/2016 - 16:40

విశాఖ: విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు కారులో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని తరలిస్తుండగా నర్సీపట్నం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

07/26/2016 - 15:51

కర్నూలు: పాణ్యం రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం ఉదయం ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి మృతదేహాలను పొలాల్లో పడేశారు. మృతులను కొలిమిగుండ్ల మండలం బోయఉప్పలపాడు గ్రామానికి దారా లక్ష్మయ్య, దారా ఓబులేశుగా పోలీసులు గుర్తించారు.

07/26/2016 - 12:50

కడప: భారీ వర్షానికి ఇల్లంతా నానిపోయి పైకప్పు కూలడంతో అయిదుగురు వ్యక్తులు నిద్రలోనే సజీవ సమాధి అయ్యారు. మైదుకూరు మండలం ఉత్సలవరంలో మంగళవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది. ఇంటి యజమాని గురప్ప (55), అతని భార్య పెంచలమ్మ (50), కుమార్తె హరిత (23), మనవలు నవనీత్ (5), యశ్వంత్ (18 నెలలు) ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. మరో కుమార్తె లలిత, మనవరాలు నిహారిక గాయపడ్డారు.

Pages