S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/27/2016 - 12:23

విజయవాడ: ఎపి మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఇక్కడ విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, పుష్కరాల్లో విద్యాశాఖ భాగస్వామ్యం, మనం-వనం తదతర అంశాలపై ఆయన చర్చించారు.

07/27/2016 - 12:22

ఒంగోలు: తెలంగాణలో ఎంసెట్-2 పేపర్ లీకేజీకి సంబంధం ఉందన్న అనుమానంతో ప్రకాశం జిల్లా కనిగిరిలో వెలుతుర్ల ఖాసిం అనే వ్యక్తిని తెలంగాణ సిఐడి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరో నిందితుడి సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా ఖాసింను పోలీసులు అనుమానించారు. రెండురోజులుగా కనిగిరిలో సిఐడి అధికారులు మకాం వేసి ఖాసిం ఆచూకీని కనుగొన్నారు.

07/27/2016 - 12:21

కడప: రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన ఒంటిమిట్ట కోదండరామాలయంలో త్వరలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన బుధవారం నాడు ఒంటిమిట్టలో ఆధునిక వసతులతో నిర్మించే సత్రానికి శంకుస్థాపన చేశారు.

07/27/2016 - 12:20

ఒంగోలు: హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ఎసి స్లీపర్ బస్సు బుధవారం ఉదయం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఓ లారీని ఢీకొన్న బస్సులో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ సహా ప్రయాణికులంతా బయటకు పరుగులు తీశారు. క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో 23 మంది ప్రయాణీకులు క్షేమంగా బతికి బయటపడగా వారి లగేజీ మాత్రం కాలిపోయింది.

07/27/2016 - 12:20

కర్నూలు: అధ్యాపకుడు కొట్టాడని తీవ్ర మానసిక వేదనకు గురైన సందీప్ అనే విద్యార్థి మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్ తీరు పట్ల నిరసనగా బుధవారం ఉదయం కళాశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన ప్రారంభించారు.

07/27/2016 - 07:57

విశాఖపట్నం, జూలై 26: ఇంధన పొదుపును ఓ ఉద్యమంలా చేపడుతున్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఇపుడు మరో అడుగు ముందుకేసింది. ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంకుడు గుంతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయగలుగుతోంది. రాష్ట్రంలో 40కి పైగా ప్రభుత్వరంగ సంస్థలుండగా, వీటిలో ఒక్క ఈపిడిసిఎల్ మాత్రమే లక్ష్యాలు అధిగమిస్తున్నట్టు తేలింది.

07/27/2016 - 07:29

హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలో పింఛను పథకంతో లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 200 నుంచి ఏకంగా వెయ్యి రూపాయలు అందుకుంటున్న వారి సంతోషం పార్టీకి-ప్రభుత్వానికి అనుకూలంగా మారలేకపోతోంది. అం దుకే బాబు ‘్భరోసా’పథకంపై సీరియస్‌గా దృష్టి సారించారు. పింఛన్లపై భారీ స్థాయిలో గ్రామసభల వేదికగా ప్రచారం సాగాలన్న లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

07/27/2016 - 07:20

ఇబ్రహీంపట్నం, జూలై 26: సుమారు రూ.350 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తున్నట్లు భూమి యజమాని మల్లెల అనంత పద్మనాభరావు తెలిపారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద విజయవాడ సబ్ కలెక్టర్ సృజనకు ప్రభుత్వానికి భూమిని ఇస్తున్నట్లు మంగళవారం విల్లింగ్ ధ్రువీకరణ పత్రం అందజేశారు.

07/27/2016 - 07:04

హైదరాబాద్, జూలై 26: అవును.. మీరు వింటున్నది నిజమే. ఇదెక్కడో చైనాలో కాదు. ఆంధ్రప్రదేశ్‌లోనే! భారీ సంపత్తి, జనాభా, యుద్ధపరికరాలతో చైనా అందరినీ భయపెడుతుంటే, చైనాను ఎలుకలు వణికిస్తున్నాయి. దానితో దిద్దుబాటుకు దిగిన చైనా ప్రభుత్వం, ఒక ఎలుకను చంపి తీసుకువచ్చిన వారికి నగదు బహుమతి ప్రకటించింది. ఆ పథకం ఇప్పుడూ అమల్లో ఉంది. ఢిల్లీలో పార్లమెంటుకు కోతుల బెడద ఎక్కువ. పార్లమెంటుకే కాదు.

07/27/2016 - 07:03

విజయవాడ, జూలై 26: కాపులను బిసిలుగా గుర్తించేందుకు నియమించబడిన జస్టిస్ మంజునాధ్ కమిషన్ ఆగస్టు మాసాంతంలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న నేపధ్యంలో ఇప్పటికే అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, సభలు, సమావేశాలు ఊపందుకోటం ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో గుంటూరుకు చెందిన సీనియర్ నేత లింగంశెట్టి ఈశ్వరరావును కాపు రిజర్వేషన్ సాధికారిత విభాగం చైర్మన్‌గా పార్టీ నియమించింది.

Pages