S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/26/2016 - 12:49

కడప: భవిష్యనిధి (పిఎఫ్) రుణాలను మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటున్న పిఎఫ్ కార్యాలయం గుమస్తాను సిబిఐ అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో ముగ్గురు కార్మికులు తమ పిఎఫ్ ఖాతాల నుంచి రుణం కోసం దరఖాస్తు చేశారు. కడపలోని పిఎఫ్ కార్యాలయంలో గుమస్తా దానం ఇందుకు లంచం అడిగాడు. దీంతో ఆ కార్మికులు సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.

07/26/2016 - 12:48

విజయవాడ: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి, కృష్ణా పుష్కరాల సమయానికి ఇక్కడి ఇంద్రకీలాద్రిని అన్ని విధాలా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై చేపడుతున్న పనులను పరిశీలించారు. పుష్కరాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలన్నారు.

07/26/2016 - 12:48

విజయవాడ: ఎపి మంత్రివర్గ సమావేశం సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఇక్కడ ప్రారంభమైంది. ఆగస్టు 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణం, మనం-వనం, ఎర్రచందనం వేలం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై మంత్రివర్గ సహచరులతో సిఎం చర్చించే అవకాశం ఉంది.

07/26/2016 - 03:18

విజయవాడ, జూలై 25: సముద్రపు నీటి ప్రభావంతో మంచినీరు సైతం ఉప్పునీరుగా మారడంతో తాగలేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు శుభవార్త. ఇకపై ఆ నీటిని శుద్ధి చేసి మరింత పరిశుభ్రంగా అందించేందుకు జినర్జీ సోలార్ ప్రాజెక్ట్, దాని అనుంబంధ సంస్థ అలెక్టోనా ఎనర్జీ కంపెనీ ముందుకొచ్చాయి. ఈ కంపెనీ చైర్మన్ తేజ్ కోహ్లీ, గ్రూప్ ఎండి, సిఇఓ రోహిత్ రవీంద్రనాథ్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

07/26/2016 - 03:11

విశాఖపట్నం, జూలై 25: విశాఖలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థల ఏర్పాటు ఇక లేనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సంస్థలు ఏర్పాటు కావడంతో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే రెండు విద్యా సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కగా, మరో రెండింటిని కాకినాడకు తరలించేందుకు నిర్ణయించారు.

07/26/2016 - 03:10

విజయవాడ (బెంజిసర్కిల్), జూలై 25: హరితాంధ్రప్రదేశే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన వనం-మనం ఉద్యమంలో స్ఫూర్తిని నింపుతూ విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుండి అధికారులు, ప్రజాప్రతినిధులతో నీరు-చెట్టు కార్యక్రమంపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/26/2016 - 03:00

హైదరాబాద్, జూలై 25: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పేషీనుంచి ఏ ఉన్నతాధికారి చాంబరు చూసినా ఒకటే హడావిడి.. సమీక్షలు.. తనిఖీలు.. సందర్శనలు.. డెమోలు.. ఇవన్నీ కృష్ణా పుష్కరాల కోసం జరుగుతున్న హడావిడే! గోదావరి పుష్కరాల సందర్భంగా రెండు డజన్ల మంది తొక్కిసలాటలో మృతి చెందిన నేపథ్యంలో, బాబు ప్రభుత్వం విమర్శలకు గురయింది. బాధ్యతారాహిత్యంవల్లే తొక్కిసలాట జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

07/26/2016 - 02:52

నెల్లూరు, జూలై 25: ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్లు ఇసుక విధానాన్ని మార్చి ఉచితం చేసినా అక్రమ రవాణా ఆగడం లేదు. కొంత మంది ఇసుక అక్రమ రవాణా వ్యాపారం చేసుకొని కాసులు పిండుతున్నారు. నెల్లూరు జిల్లా చెన్నై రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో పెద్దఎత్తున ఇసుక తరలిపోతోంది. అక్రమ రవాణాపై సరిహద్దులో తనిఖీ లేకుండాపోయింది. పర్యావరణ అనుమతి లేని ఇసుక రేవులో సైతం అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి.

07/26/2016 - 02:50

కర్నూలు, జూలై 25: శ్రీశైలం జలాశయం నీటి మట్టం సోమవారం 800 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి 31 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో 29.01 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాలలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 802 అడుగులు ఉండగా, 30.23 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

07/26/2016 - 02:47

వేపగుంట/గోపాలపట్నం, జూలై 25: దైవాన్ని నమ్ముకొని ధైర్యంగా ఉండాలని వాయుసేన విమాన ప్రమాద కుటుంబాలకు వైకాపా అధినేత జగన్ ధైర్యం చెప్పారు. సోమవారం వేపగుంట, అప్పన్నపాలెం ప్రాంతాల్లోని గంట్ల శ్రీనివాస్, బి. సాంబమూర్తి కుటుంబాలను పరామర్శించారు. బాధితులు మనోవేదనతో జగన్ ముందు విలపించారు.

Pages