ఆంధ్రప్రదేశ్‌

మంచినీరుగా ఉప్పునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: సముద్రపు నీటి ప్రభావంతో మంచినీరు సైతం ఉప్పునీరుగా మారడంతో తాగలేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు శుభవార్త. ఇకపై ఆ నీటిని శుద్ధి చేసి మరింత పరిశుభ్రంగా అందించేందుకు జినర్జీ సోలార్ ప్రాజెక్ట్, దాని అనుంబంధ సంస్థ అలెక్టోనా ఎనర్జీ కంపెనీ ముందుకొచ్చాయి. ఈ కంపెనీ చైర్మన్ తేజ్ కోహ్లీ, గ్రూప్ ఎండి, సిఇఓ రోహిత్ రవీంద్రనాథ్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉప్పునీటిని మంచినీటిగా మార్చి ఒయాసిస్సులుగా ఏర్పాటు చేయడానికి తమ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, కోస్తా ప్రాంతంలో ఎక్కడైనా ప్రయోగాత్మంగా ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒక ప్రాజెక్ట్ స్థాపనకు నాలుగు నుంచి ఏడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని, తాము 3.69 లక్షల రూపాయలకే ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. సౌర విద్యుత్‌తో నడిచే ఓఆర్ ప్లాంట్ల ద్వారా ఏపిలో గ్రామీణ మంచినీటి సరఫరాలో తాము భాగస్వాములమవుతామని కోహ్లీ తెలిపారు. ఈ పథకానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి తెలిపారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన జినర్జీ సోలార్ ప్రాజెక్ట్ ప్రతినిధులు