ఆంధ్రప్రదేశ్‌

తప్పిదాలకు తావు లేకుండా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పేషీనుంచి ఏ ఉన్నతాధికారి చాంబరు చూసినా ఒకటే హడావిడి.. సమీక్షలు.. తనిఖీలు.. సందర్శనలు.. డెమోలు.. ఇవన్నీ కృష్ణా పుష్కరాల కోసం జరుగుతున్న హడావిడే! గోదావరి పుష్కరాల సందర్భంగా రెండు డజన్ల మంది తొక్కిసలాటలో మృతి చెందిన నేపథ్యంలో, బాబు ప్రభుత్వం విమర్శలకు గురయింది. బాధ్యతారాహిత్యంవల్లే తొక్కిసలాట జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో సోమయాజులు కమిషన్ వేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఘాట్లు, రోడ్లు, లైటింగ్‌లో భారీ అవినీతి చోటుచేసుకుందని, నాసిరకం పనులు జరిగాయని మిత్రపక్షమైన బిజెపి కూడా ఆరోపించింది.
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయ. ఈసారి ఏర్పాట్లు భిన్నంగా ఉండాలన్న బాబు ఆదేశాల మేరకు పుష్కర ఘాట్లలో ఏం జరుగుతుందన్న విషయాన్ని సీఎంఓ, తన నివాసం నుంచే పర్యవేక్షించే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈసారి 2వేల కెమేరాలను రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తున్నాయి. రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఇటీవల విజయవాడకు వచ్చినప్పుడు, పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని బాబు కోరగా, అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభు 600 ప్రత్యేక రైళ్లతోపాటు, పుష్కరనగర్ల వద్దనే రైల్వే బుకింగ్ కౌంటర్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. భక్తులకు సేద తీర్చేందుకు 26వేల చదరపు మీటర్ల ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేయనున్నారు. పుష్కర ప్రాంగణాల్లో అప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 20 వేల మంది క్లీనింగ్ స్ట్ఫాను నియమించనున్నారు. సంగమ ప్రదేశాల్లో ప్రతిరోజు సాయంత్రం పవిత్ర హారతికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అక్కడ ట్రాఫిక్, విద్యుత్, మునిసిపల్ విభాగాలు ఎక్కువ దృష్టి సారించాలని ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో బాబు ఆదేశించారు. వివిధ శాఖలు రూపొందిస్తున్న డిజైన్లు బాబుకు ఒక పట్టాన నచ్చడం లేదు. ఆయన అంచనాకు తగినట్లుగా అధికారులు వాటిని రూపొందించలేక పోతున్నారు. మళ్లీ వాటిని హైదరాబాద్‌కు పంపించి, మార్పుచేర్పులు చేయిస్తూ, పరుగులు తీస్తున్న పరిస్థితి ఏర్పడింది.
పుష్కర ఏర్పాట్లు, భద్రత పోలీసులకు సవాలుగా మారింది. దీనిపై డిజిపితోపాటు ఆర్టీసీ చైర్మన్‌గా కూడా జమిలి బాధ్యతలు నిర్వర్తిస్తోన్న నండూరి సాంబశివరావు, రెండు రోజుల నుంచి రెండు శాఖలతో వరస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు నుంచే పుష్కర ఏర్పాట్లకు సంబంధించిన రిహార్సల్స్ జరిపి, లోటుపాట్లు సరిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. భక్తులకోసం రైల్వే, బస్టాండ్ల నుంచి బస్సులను ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు. కృష్ణా, గుంటూరు అర్బన్-రూరల్, కర్నూలు జిల్లాల్లోని ఘాట్లను విజయవాడలోని కమాండ్ కంట్రోల్ నుంచి సిసి టివిల ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ ఘాట్లకే ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులను నియంత్రించడంతోపాటు, క్రమబద్దీకరణపై లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పుష్కర ఏర్పాట్లపై బాబు సగటున రోజుకు 6 గంటలు సమీక్షలు నిర్వహిస్తుండటంతో అధికారులు పరుగులు తీయాల్సి వస్తోంది.

విజయవాడ వద్ద పుష్కర ఘాట్ల ఏర్పాట్లు (ఫైల్ ఫొటో)