ఆంధ్రప్రదేశ్‌

సొంత భవనాలు...ఇంకుడు గుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 26: ఇంధన పొదుపును ఓ ఉద్యమంలా చేపడుతున్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఇపుడు మరో అడుగు ముందుకేసింది. ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంకుడు గుంతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయగలుగుతోంది. రాష్ట్రంలో 40కి పైగా ప్రభుత్వరంగ సంస్థలుండగా, వీటిలో ఒక్క ఈపిడిసిఎల్ మాత్రమే లక్ష్యాలు అధిగమిస్తున్నట్టు తేలింది. ఇంధన పొదుపుతోపాటు చుక్క నీటిని కూడా వృథాగా పోనివ్వకుండా రాబోయే రోజుల్లో నీటి కొరతను అధిగమించడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రభుత్వ లక్ష్యాల్లో ఈ సంస్థ భాగస్వామ్యమైంది. ఇందులో భాగంగా సంస్థ పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల్లో ఉన్న ఈపీడీసిఎల్ కార్యాలయాలు, విభాగాలు, సొంత భవనాల్లో ఇంకుడు గుంతలు నిర్మించగలిగింది. ఈ విధంగా దాదాపు వెయ్యి ఇంకుడు గుంతులు నిర్మంచింది. ఇవి కాకుండా ఉద్యమంలో తీసుకుని మరికొన్ని సంస్థ డివిజన్ కార్యాలయాలు, వీఆర్‌ఓ, సబ్ డివిజనల్ సెక్షన్ కార్యాలయాలు, కాల్‌సెంటర్లు వద్ద వీటిని నిర్మించేందుకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. * రూ.45 కోట్లతో సొంత భవనాలు
రాష్ట్రంలో ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఎపీఎస్‌ఇబి)గా ఉన్న విద్యుత్ సంస్థను 2000లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుగా విభజించింది. దీనివల్ల రాష్ట్రంలో నాలుగు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కంలు) ఆవిర్భవించాయి. ఏపీఇపిడిసిఎల్, ఎస్‌పిడిసిఎల్, సిపిడిసిఎల్, ఎన్‌పిడిసిఎల్‌లుగా ఏర్పడ్డాయి. ఇందులో విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో కూడిన కార్పొరేట్ కార్యాలయం నడుస్తోంది. వరంగల్ కేంద్రంగా ఎన్‌పిడిసిఎల్, హైదరాబాద్ కేంద్రంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, తిరుపతి కేంద్రంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలున్నాయి. అయితే ఈ విధంగా ఏర్పడిన డిస్కంల పరిధిలో సొంత భవనాలు పూర్తిస్థాయిలో ఒక్క ఈపిడిసిఎల్ పరిధిలోనే నిర్మించుకోగలిగింది. ఇందులో కూడా ఈ సంస్థే ముందంజలో నిలిచింది. రూ.45 కోట్ల వ్యయంతో 2,45,000 చదరపు అడుగుల భవనాల నిర్మాణాలు దశలవారీగా పూర్తిచేసింది. ఇందులో డివిజన్ కార్యాలయాలు, వీఆర్‌ఓ, సబ్-డివిజన్, సెక్షన్ కార్యాలయాలు, కాల్‌సెంటర్లకు సొంత భవనాలు నిర్మించబడ్డాయి. 2006లోనే ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి విశాఖ నడిబొడ్డున సంస్థ కార్పొరేట్ కార్యాలయాలన్ని 40వేల చదరపు అడుగుల స్థలంలు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. భవన నిర్మాణాల తొలి దశలో భాగంగా 2008లో శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు సర్కిళ్ళ పరిధిలో రూ.9.15 కోట్ల వ్యయంతో 21 వేల చదరపు అడుగుల స్థలంలో సర్కిల్, డివిజన్, ఎస్‌పిఎమ్ డివిజన్ ఎంఆర్‌టి, కన్‌స్ట్రక్షన్ కార్యాలయాల కోసం వినియోగించింది. మరో రూ.16.63 కోట్లతో టెక్కలి, బొబ్బిలి జోన్-3 పాడేరు, నర్సీపట్నం, రామచంద్రపురం, జగ్గంపేట, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, భీమవరం, కాకినాడల్లో నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాతపట్నం, సోంపేట, పలాస, పాలకొండ, రాజాం, విజయనగరం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, విశాఖ జిల్లాలోని వడ్డాది, అరకు, ఎలమంచిలి, మల్కాపురం, చింతపల్లి ప్రాంతాల్లో సబ్ డివిజన్, సబ్ ఈఆర్‌ఓ కార్యలయాల కోసం మరో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు రూ. 5.6 కోట్ల ఖర్చుతో నిర్మించింది. వీటితోపాటు ఏపీఈపిడిసిఎల్ మొత్తం 67 కస్టమర్ సర్వీస్ సెంటర్లను ఆధునీకరించింది.

ప్రత్యేక హోదాపై పట్టుదల
విభజన సమయంలో ఏమైంది
కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన గాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌పార్టీ పార్లమెంటులో విభజిస్తున్నప్పుడు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు ఏమి చేస్తున్నారని టిడిపి ధ్వజమెత్తింది. ప్రత్యేక హోదాకోసం టిడిపి కృషి చేస్తోందని, కాని కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో పార్లమెంటులో హంగామా చేయడం వల్ల ఉపయోగం లేదని టిడిపి అధికార ప్రతినిధులు గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. మంగళవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కాంగ్రెస్ కారణమన్నారు. రెండు సభల్లో కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లుకు మద్దతు ఇస్తే బిజెపి మద్దతు ఇచ్చిందన్నారు. విభజన సమయంలోనే ఆంధ్రాకు ఐదు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజి ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారన్నారు. టిడిపికి ఏపి ప్రయోజనలే ముఖ్యమని, మంత్రి పదవులు కాదన్నారు. విభజన సమయంలోనే చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపరిచి ఉంటే ఈ సమస్య ఉండేది కాదన్నారు.