ఆంధ్రప్రదేశ్‌

సెక్రటేరియట్‌కు కొత్త లుక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన పనులు ఊపందుకున్నాయి. నిన్నమొన్నటి వరకూ మొండి గోడలతో కనిపించిన సెక్రటేరియట్ ఇప్పుడు కొత్త లుక్కుతో కనిపిస్తోంది. కార్పొరేట్ కార్యాలయ భవనాన్ని తలపించేలా ఉంది. సెక్రటేరియట్‌లో ఇంటీరియల్ డెకరేషన్ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఫ్లోరింగ్ పని కూడా చాలావరకూ పూర్తయింది. అయితే మంత్రులు ఛాంబర్లలో తప్ప, మిగిలినచోట్ల టాయిలెట్ల నిర్మాణం జరగలేదు. అలాగే తాగునీటి సదుపాయం లేదు. అయినప్పటికీ మంత్రుల ఛాంబర్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి ఛాంబర్, పేషీ, అలాగే చీఫ్ సెక్రటరీ పేషీలు కూడా దాదాపు పూర్తయ్యాయి. భవనానికి బయట రంగులు వేస్తున్నారు. దీంతో సెక్రటేరియట్ కొత్త హంగులతో కళకళలాడుతూ కనిపిస్తోంది. సెక్రటేరియట్‌కు వెళ్లే ప్రధాన ద్వారం వద్ద సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడ చేరే మురికి నీటిని శుద్ధి చేసి, ఆ నీటిని సెక్రటేరియట్ చుట్టుపక్కల మొక్కలకు పంపిస్తారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోపక్క మందడం నుంచి సెక్రటేరియట్ వరకూ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ చుట్టుపక్కల శాశ్వత రోడ్ల నిర్మాణం ముమ్మరంగా జరుగుతోంది. మంత్రి నారాయణ నిరంతరం సెక్రటేరియట్ వద్దే ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏదియేమైనా ఆగస్ట్ నెలాఖరు నాటికి ఉద్యోగులకు సెక్రటేరియట్ అందుబాటులోకి రానుంది.

చిత్రం.. తాత్కాలిక సెక్రటేరియట్ పనులు చకచకా జరుగుతుండటంతో కొత్త లుక్కుతో కనిపిస్తున్న దృశ్యం
నిర్మాణంలో ఉన్న సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్