S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/30/2016 - 07:12

విజయవాడ, జూలై 29: కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న కొద్దీ అదే స్పీడ్‌లో వివాదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పుష్కరాల సందర్భంగా ఒక్క విజయవాడ నగరానికే దాదాపు మూడు కోట్ల మంది పైగా యాత్రికులు తరలి వస్తారనే అంచనాతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది.

07/30/2016 - 06:55

మంత్రాలయం, జూలై 29: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్రతీర్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును శుక్రరవారం రాజధానిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆగస్టు 17 నుంచి జరుగనున్న 345వ శ్రీ రాఘవేంద్రస్వామి సప్తఆరాధనోత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.

07/30/2016 - 06:54

విశాఖపట్నం, జూలై 29: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో చెదురు, మదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగాను, ఉత్తర కోస్తాలో నైరుతి దిశగాను గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

07/30/2016 - 06:51

చిత్తూరు, జూలై 29 : చిత్తూరు ఎంపి డాక్టర్ ఎన్ శివప్రసాద్ మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం వేషధారణలో అలరించారు. చిత్తూరు మార్కెట్‌యార్డులో 67వ వనమహోత్సవం జరిగింది.అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎంపి శివప్రసాద్ కలాం వేషధారణలో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ముఖ్యంగా విద్యార్థుల వద్ద వెళ్లి కాసేపు ముచ్చటించారు.

07/30/2016 - 06:51

చింతూరు, జూలై 29: మావోయిస్టులు దండ కారణ్య సరిహద్దు ప్రాంతాల్లో పట్టుకోసం పోరాటం సాగిస్తున్నారు. పోలీసులు మావోయిస్టుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్ని ఎదురుదాడికి దిగుతుండటంతో ఇప్పుడు రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

07/30/2016 - 06:50

విశాఖపట్నం, జూలై 29: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ) ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంథ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తరగతి గదులను తీర్చిదిద్దగా, ఇతర ఏర్పాట్లలో ఎయు, హెచ్‌పిసిఎల్, ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థులు బిజీగా ఉన్నారు.

07/30/2016 - 06:50

చిత్తూరు/తిరుపతి/కడప, జూలై 29: రుతుపవనాల ప్రభావంతో సీమలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయ. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహించగా సోమల, చౌడేపల్లి మండలాల్లో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. అనేక ప్రాంతాల్లో జోరుగా ఈదురు గాలులు ఉరుములు మెరుపులతోకూడిన వర్షం కురవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

07/30/2016 - 06:48

రాజమహేంద్రవరం, జూలై 29: నదుల అనుసంధానం ప్రయోజనం ఈ ఏడాది కృష్ణా పుష్కరాలకు పూర్తిస్థాయిలో కనిపిస్తోంది. గత ఏడాది గోదావరి పుష్కరాల సమయంలో స్నానాలకు అనువుగా నీటి మట్టాన్ని కొనసాగించడానికి అధికార్లు విపరీతమైన కసరత్తు చేయాల్సివచ్చింది. సీలేరు నుండి సైతం జలాలను విడుదలచేయించి, గోదావరి ఘాట్లలో స్నానాలకు అనువుగా నీటిమట్టాన్ని నిర్వహించారు.

07/30/2016 - 05:18

కర్నూలు, జూలై 29: తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరిని సిఐడి అధికారులు శుక్రవారం కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న సూరజ్ గ్రాండ్ హోటల్‌లో బసచేసిన వెంకటరమణ, తరుణ్‌ను శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

07/30/2016 - 04:02

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ ఎమ్సెట్-2 లీకేజి కేసులో సూత్రధారిగా భావిస్తున్న షేక్ రమేష్ అనే వ్యక్తిని సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కర్నూలులోని ఒక హోటల్ వద్ద తరుణ్‌రాజ్, వెంకటేష్‌లను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వీరిని హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరింది.

Pages