S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/01/2016 - 05:19

తిరుపతి, జూలై 31: బ్రెయిన్ డెడ్ పరిస్థితుల్లో ఉన్న రోగి చిరంజీవిరెడ్డి (45) బంధువుల అనుమతితో ఆదివారం అవయవదానం చేసినట్లు డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ తెలిపారు. తిరుపతి గాంధీపురానికి చెందిన బి చిరంజీవిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని స్విమ్స్‌లో మెరుగైన వైద్యం కోసం చేరారన్నారు.

08/01/2016 - 03:21

విజయవాడ, జూలై 31:‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య. రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయించే అంశం. ఇటువంటి అంశాన్ని సానుకూలంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానికి, కేంద్రానికి లేదా? ప్రధాని రెండు గంటలు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

08/01/2016 - 03:18

విజయవాడ, జూలై 31: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పట్ల తెలుగుదేశం ఎంపిలు చంద్రబాబు ఎదుట ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. కేంద్రం వైఖరికి నిరసనగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రంలో మంత్రులుగా ఉన్న సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.

08/01/2016 - 03:16

విజయవాడ, జూలై 31: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ బాధ్యతలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో విదేశీ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందుకు ఇప్పటినుంచే తన వంతు ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వ వ్యూహరచనలో భాగంగా అవసరమైన సివిల్ ఇంజనీర్లను సమీకరించేందుకు కొన్ని దళారీ ఏజెన్సీలు తాజాగా రంగంలోకి దిగాయి.

08/01/2016 - 03:11

గుంటూరు, జూలై 31: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించిన అంశాలపై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ నెల 8న సిఆర్‌డిఏ అధికారులు ప్రాథమిక సమావేశం (ప్రీ బిడ్ కాన్ఫరెన్స్) నిర్వహించాలని నిర్ణయించారు.

07/31/2016 - 06:49

చిత్తూరు, జూలై 30: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గ కేంద్రమైన మేజర్ పంచాయతీ కుప్పంలో ఆ పార్టీలో అనిశ్చితి నెలకొంది. కుప్పం సర్పంచ్, వైస్ సర్పంచ్ వర్గీయుల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా కుప్పంలో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

07/31/2016 - 06:48

రాజమహేంద్రవరం, జూలై 30: అంత్య పుష్కరాలకు రాజమహేంద్రవరం నగరం ఇనుప బ్యారికడ్ల నడుమ ఉక్కిరిబిక్కిరి కానుంది. అంతంతమాత్రంగా భక్తులు తరలివచ్చే అంత్య పుష్కరాలకు రాజమహేంద్రవరం కేంద్రంగా సాగుతున్న భద్రతాఏర్పాట్లపై పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

07/31/2016 - 06:48

విజయవాడ, జూలై 30: కృష్ణా పుష్కరాల సందర్భంగా రహదారుల విస్తరణ పేరిట విజయవాడ నగరంలో ప్రార్థనా మందిరాలు, జాతీ య నేతల విగ్రహాల తొలగింపులో భాగంగా శనివారం తెల్లవారుజామున నగర నడిబొడ్డులో ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలోని 12 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం తొలగింపు అధికారుల దుందుడుకు చర్యలకు పరాకాష్ఠగా నిలిచింది.

07/31/2016 - 06:45

హైదరాబాద్, జూలై 30: ప్రత్యేక హోదాపై ఏపిలో నాలుగు స్తంభాలాట కొనసాగుతోంది. నాలుగు ప్రధాన పార్టీలు ఎవరికి వారు రాజకీయ ప్రయోజనం పొందేందుకు పరుగులు తీస్తున్నాయి. అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, దానిని సమర్థించి ఇప్పుడు చిక్కుల్లో పడిన భాజపా హోదాపై రాజకీయ క్రీడల్లో మునిగిపోయాయి.

07/31/2016 - 06:44

విశాఖపట్నం, జూలై 30: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ శనివారం ఉదయం హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఎయు సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించే సౌకర్యాన్ని శనివారం ప్రారంభించిన నేపథ్యంలో ఇది జరగడం గమనార్హం. ఉదయం 7 గంటల ప్రాంతంలో ‘ఆంధ్రాయూనివర్సిటీ.ఎడ్యు.

Pages