ఆంధ్రప్రదేశ్‌

తాను చనిపోయాడు.. నలుగురిని బతికించాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 31: బ్రెయిన్ డెడ్ పరిస్థితుల్లో ఉన్న రోగి చిరంజీవిరెడ్డి (45) బంధువుల అనుమతితో ఆదివారం అవయవదానం చేసినట్లు డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ తెలిపారు. తిరుపతి గాంధీపురానికి చెందిన బి చిరంజీవిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని స్విమ్స్‌లో మెరుగైన వైద్యం కోసం చేరారన్నారు.
రోగి చనిపోతాడని నిర్ధారించుకున్న చిరంజీవిరెడ్డి బంధువులు అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నట్లు తమకు తెలిపారన్నారు. దీంతో జీవన్‌దాన్ ట్రస్టు వర్గాలకు సంబంధించిన వారిని పిలిపించి అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందులో చిరంజీవిరెడ్డికి చెందిన గుండెను హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు, లివర్‌ను వైజాగ్ అపోలో హాస్పిటల్‌కు విమానం ద్వారా తరలించినట్లు చెప్పారు. ఒక కిడ్నీని నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి రోడ్డుమార్గాన తరలించామన్నారు. మరో కిడ్నీని స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్న రోగికి అమర్చనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి.సత్యనారాయణ, ఇతర అధికారులు అవయవదానం చేసిన చిరంజీవి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
స్విమ్స్ చరిత్రలో తొలిసారిగా 4 అవయవాలను దానం చేసిన చిరంజీవిరెడ్డి కుటుంబ సభ్యులకు స్విమ్స్ డైరెక్టర్ తరపున డాక్టర్ ఆదికృష్ణ, డాక్టర్ వెంకటరామరెడ్డి, సుదర్శన్, ప్రసాదరెడ్డి, జయశ్రీ, ప్రకాష్‌లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కృషి చేసిన ఫ్యాకల్టీ డాక్టర్లను, నర్సింగ్ తదితర సిబ్బందిని డైరెక్టర్ రవికుమార్ అభినందించారు.