ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగమిస్తాం... చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 31: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ బాధ్యతలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో విదేశీ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందుకు ఇప్పటినుంచే తన వంతు ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వ వ్యూహరచనలో భాగంగా అవసరమైన సివిల్ ఇంజనీర్లను సమీకరించేందుకు కొన్ని దళారీ ఏజెన్సీలు తాజాగా రంగంలోకి దిగాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్లాన్‌లను కొన్ని విదేశీ సంస్థలు ఇప్పటికే రూపొందించి ప్రభుత్వ ఆమోదం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుంచాయి. ఈ ప్లాన్‌లు ఆమోదం పొందిన వెంటనే పనులు కూడా శరవేగంతో ప్రారంభించేందుకు తొలిదశలో కనీసం వెయ్యిమందికి పైగా సివిల్ ఇంజనీర్లు అవసరమని భావిస్తుండటంతో నిర్ణీత నెలవారీ వేతనాలపై కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలు పోటీ పడుతున్నాయి. సీనియర్ ఇంజనీర్లు అయితే వారు కోరినంత ఫీజు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో పేరొందిన ఇంజనీరింగ్ కంపెనీలకు వెళ్లి ఇంజనీరింగ్ విభాగం అధిపతులతో సమాలోచనలు సాగిస్తున్నారు. వారి తోడ్పాటుతో ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులతో సంప్రదింపులు సాగిస్తున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు ఉపాధి లభించేలా చూస్తామని, ఆకర్షణీయమైన, సంతృప్తికరమైన వేతనాలు లభించేలా చూస్తామని ముందుగా పేర్లు నమోదు చేసుకుని కాంట్రాక్ట్ కాగితాలపై సంతకాలు చేసిన వారికి తొలి ప్రాధాన్యతనిస్తామని కూడా ఈ ఏజెన్సీలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. విదేశీ సంస్థలు ఇచ్చే ప్లాన్‌ల ప్రకారం స్థానిక కూలీలతో ఈ సివిల్ ఇంజనీర్లు రాత్రి, పగలు పనులు చేయించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలో కొన్ని స్వదేశీ విదేశీ సంస్థలకు కూడా విద్యా సంస్థల నిర్మాణాల కోసం రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే కొన్ని వందల ఎకరాలు కేటాయించింది. అందులో త్వరలో ప్రారంభం కానున్న భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణాలకు కూడా అవసరమైన సివిల్ ఇంజనీర్లను సమీకరించే బాధ్యతను మరికొన్ని ఏజెన్సీలు చేపట్టాయి.