ఆంధ్రప్రదేశ్‌

రాజీనామాకు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 31: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పట్ల తెలుగుదేశం ఎంపిలు చంద్రబాబు ఎదుట ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. కేంద్రం వైఖరికి నిరసనగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రంలో మంత్రులుగా ఉన్న సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. హోదాపై లోక్‌సభలో జరుగుతున్న చర్చ, అందులో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై పార్టీ ఎంపిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం సిఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. వాడివేడిగా జరిగిన ఈ సమావేశంలో ప్రత్యేక హోదా గురించి జైట్లీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా, బిజెపితో కలిసి పనిచేస్తున్నాం. కేవలం రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నాం. అయినా, జైట్లీ తమకేమీ పట్టనట్టు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు టివిలో చూసినప్పుడు నాకెంతో కోపం వచ్చంది. సభలో ఉన్న మీరు ఎందుకు ఆయన వ్యాఖ్యలను ఖండించలేకపోయారు?’ అని చంద్రబాబు ఎంపిలను ప్రశ్నించారు. సభలో వ్యూహాత్మకంగా వ్యవహరించలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘హోదా సాధించడంలో విఫలమైతే, భవిష్యత్‌లో ప్రజలు ఎవ్వరినీ క్షమించరు. పార్లమెంట్‌లో ప్రజల పక్షాన పోరాడాల్సింది మీరే. ప్రజలు అన్ని విషయాలూ గమనిస్తున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేను పదే పదే ఢిల్లీకి రాను. రాష్ట్రం తరపున మీరే మాట్లాడాలి. కేంద్రంపై వత్తిడి తేవాలి’ అంటూ చంద్రబాబు ఎంపిలకు క్లాస్ తీసుకున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకోండి. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఆయనకు వివరించండి. మోదీ వ్యవహార శైలిని పరిశీలించిన తరువాత మనం ఒక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు ఎంపిలకు చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రులు సుజన, అశోక గజపతిరాజు మాట్లాడుతూ సభలో సమాచార లోపం వలన చర్చలో తడబడ్డామని అన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు సిఎంకు చెప్పారు. మీరు ఆమోదిస్తే, వెంటనే రాష్టప్రతిని కలిసి రాజీనామా లేఖలు సమర్పిస్తామని అన్నారు. అయితే తొందరపడద్దంటూ వారిని సిఎం వారించినట్టు తెలిసింది. ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకునే ముందు నిరసనలు తెలపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని సమావేశం తరువాత కూడా ఏపికి న్యాయం జరుగుతుందని తేలకపోతే, మన దారి మనం చూసుకుందామని సిఎం చంద్రబాబు ఎంపిలకు చెప్పినట్టు తెలిసింది. కొందరు ఎంపిలు మాట్లాడుతూ ఆర్థిక పరమైన ఇబ్బంది లేకపోయినా, నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ససేమిరా అంటోందని అన్నారు. అలాగే ఏపికి ఏ విషయంలోనూ కేంద్రం నిధులు మంజూరు చేసేందుకు ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్ధమైన లేఖ
సమావేశం అనంతరం ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ఎంపిలు ప్రయత్నించారు. అపాయింట్‌మెంట్ దొరికితే ఆయనకు వివరించాల్సిన అంశాల గురించి ముందుగా చర్చించుకున్నారు. అలాగే ప్రధానికి సమర్పించేందుకు లేఖ కూడా తయారు చేసుకున్నారు. తెలుగుదేశం ఎంపిలు ఈ లేఖను ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించారు. ఎంపిలంతా రాత్రి విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

chitram...
టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

చంద్రబాబంటే
మోదీకి భయం
జేసి వ్యాఖ్యలు
బిజెపి, టిడిపిల సయోధ్య కుదరదని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాననీ, ఎవ్వరూ పట్టించుకోలేదనీ. ఇది కలహాల కాపురమేననీ ఎంపి జెసి దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపిల సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం సిఎం క్యాంపుకార్యాలయానికి వచ్చిన జెసి మీడియాతో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు, నితీశ్ కుమార్‌లను చూసి మోదీ భయపడుతున్నారు. ఎందుకంటే వీరిద్దరూ ప్రధాని అభ్యర్థులు కనుక’ అని దివాకరరెడ్డి చెప్పారు. అందుకే హోదా ఇవ్వడానికి ప్రధాని ఇబ్బందిపడుతున్నారన్నారు.