S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/31/2016 - 06:14

సింహాచలం, జూలై 30: దేవాలయాల్లోని అర్చకులు, పురోహితులుగా విధులు నిర్వహిస్తున్న వారికి బయోమెట్రిక్ విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత బ్రాహ్మణ సంఘ సమాఖ్య పేర్కొంది.

07/31/2016 - 06:15

రాపూరు, జూలై 30: అన్నీ తానై ఓ కన్నతల్లికి కొడుకు లేని లోటు తీర్చే విధంగా తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలం పులిగెలపాడు గ్రామంలో శనివారం జరిగింది. రాపూరు ఆర్‌టిసి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న అంకమ్మ (36) తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతిచెందింది. అయితే ఈమెకు కొడుకులు లేరు. ఒక కుమార్తె మాత్రమే ఉంది.

07/30/2016 - 18:49

కడప: పీఎఫ్‌ కార్యాలయంలో పింఛను సొమ్మును స్వాహా చేసిన కేసులో ఒకటో పట్టణ పోలీసులు ముగ్గురు విశ్రాంత ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పరారీలో వున్న మరో ఉద్యోగి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి రూ.9లక్షల నగదు, రెండు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

07/30/2016 - 18:44

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా అంశంపై ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదాపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును చూసి రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు రామకృష్ణ, చెలకాని శ్రీనివాసరావు శనివారం అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం విభజన బిల్లులో లేదని, ఇతర కారణాలు చెబుతూ వాయిదా వేయడం సమంజసం కాదన్నారు.

07/30/2016 - 17:31

కర్నూలు : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలతో పాటు మరో ఇద్దరిపై హత్యకేసు నమోదయ్యింది. నంది అకాడమీలో పీఆర్వోగా పనిచేసిన సుమంత్ హత్య కేసులో ఎంపీ కూతురిని అరెస్ట్ చేయాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. సుజల సూచన మేరకు మురళి, షఫీ అలీ అనే ఇద్దరు సుమంత్‌ను దారుణంగా కొట్టి చంపినట్లు మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై హత్యకేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

07/30/2016 - 17:23

విజయవాడ: ఎన్‌డిఎ ప్రభుత్వంలో తమ పార్టీకి ఉన్న రెండు మంత్రి పదవులు పోయినా కొంప మునిగేదీమీ లేదని, ప్రత్యేక హోదా కోసం తాము ఎంతటి పోరాటాలకైనా సిద్ధమేనని టిడిపి ఎంపి కేశినేని నాని శనివారం మీడియాతో అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి ఎంపీలు రాజీనామాలు చేసేందుకైనా రెడీగా ఉన్నారని అన్నారు.

07/30/2016 - 17:00

విజయవాడ: జపాన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌, ఫారెస్ట్రీ, ఫిషరీస్‌తో ఒప్పందాలు చేసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. జపాన్‌ బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఫుడ్‌వాల్యూ చెయిన్‌ ఫుడ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు ఎంఏఎఫ్‌ఎఫ్‌ సహకారం అందిస్తుందని సీఎం తెలిపారు. అంతర్జాతీయస్థాయిలో పేరొందిన శిక్షణాసంస్థల ద్వారా యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు.

07/30/2016 - 16:33

విశాఖ: గల్లంతైన భారత వాయుసేనకు చెందిన విమానం (ఏఎన్‌-32) కోసం విశాఖ జిల్లా అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. నాతవరం మండలం సరుగుడు, దద్దుగుల ప్రాంతాల్లో గిరిజన గ్రామాల ప్రజలతో కలిసి గాలిస్తున్నారు.

07/30/2016 - 14:47

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విస్తృత సన్నాహాలు చేస్తున్నామని ఎపి డిజిపి నండూరి సాంబశివరావు శనివారం మీడియాకు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించామని, ఘాట్‌ల వద్దకు నేరుగా వాహనాలను అనుమతించేది లేదన్నారు. ఘాట్‌లకు కనీసం కిలోమీటర్ దూరంలో వాహనాలను నిలపాలన్నారు.

07/30/2016 - 14:46

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న టిడిపి ఎంపీలతో ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు ఆదివారం ఇక్కడ భేటీ అవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి ఆర్థిక సాయం, ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి తదితర అంశాలపై ఆయన ఎంపీలతో చర్చించే అవకాశం ఉంది.

Pages