ఆంధ్రప్రదేశ్‌

రెండు మంత్రి పదవులు పోయినా బాధ లేదు: కేశినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎన్‌డిఎ ప్రభుత్వంలో తమ పార్టీకి ఉన్న రెండు మంత్రి పదవులు పోయినా కొంప మునిగేదీమీ లేదని, ప్రత్యేక హోదా కోసం తాము ఎంతటి పోరాటాలకైనా సిద్ధమేనని టిడిపి ఎంపి కేశినేని నాని శనివారం మీడియాతో అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి ఎంపీలు రాజీనామాలు చేసేందుకైనా రెడీగా ఉన్నారని అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగత తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని, ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆదివారం ఇక్కడ తమ పార్టీ అధినేత చంద్రబాబుతో ఎంపీలంతా సమావేశమవుతున్నట్టు నాని తెలిపారు. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తమకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారన్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న భావనతోనే కేంద్ర మంత్రిమండలిలో తమ పార్టీ చేరిందన్నారు. వైకాపా అధినేత జగన్ చేస్తున్న దీక్షలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.