S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/31/2016 - 06:43

హైదరాబాద్, జూలై 30: నటనతోనే కాదు.. తనను ఆదరించే అభిమానుల ఆకాంక్షనూ తీర్చడంలోనూ తనకు తానే సాటిగా నిరూపించుకున్నారు. యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. తనను కలవాలనుకున్న ఓ క్యాన్సర్ రోగిని పలకరించారు. అంతేకాకుండా తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులనూ కలుసుకునే అవకాశం కల్పించారు. బెంగుళూరుకు చెందిన నాగార్జున ఎప్పటికైనా తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను కలవాలన్నది అతని కోరిక.

07/31/2016 - 06:37

విజయవాడ, జూలై 30: గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలను ఒక అనుభవంగా తీసుకుని కృష్ణా పుష్కరాలలో ఏ ఒక్క యాత్రికుడు కూడా ప్రవేశం నుంచి తమ తమ గమ్యాలకు చేరేవరకు కూడా ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం అన్ని స్థాయిల్లోనూ పోలీస్, రెవెన్యూ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయనున్నాయన్నారు.

07/31/2016 - 06:31

మద్దిపాడు, జూలై 30: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెంకట రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మద్దిపాడు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

07/31/2016 - 06:30

విజయనగరం, జూలై 30: అనైతికంగా, అన్యాయంగా జరిగిన విభజన కారణంగా అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో, ప్రత్యేక హోదా, నిధులు, పథకాల మంజూరులో కేంద్ర ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తే లేదని జిల్లా ఇన్‌చార్జి, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేసారు. అలా అని కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపడే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు.

07/31/2016 - 06:28

అనంతపురం, జూలై 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తిరుగుబాటు తప్పదని పిసిసి అధ్యక్షుడు రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పునరుద్ఘాటించారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులు హోదా కోసం పార్లమెంటువైపు ఆశగా చూస్తున్నారన్నారు. శనివారం అనంతపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దురదృష్టం కొద్దీ రాష్ట్ర విభజన జరిగిందన్నారు.

07/31/2016 - 06:25

విశాఖపట్నం, జూలై 30: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ వైఖరి, పోలవరం ప్రాజెక్టు అంశం నేపథ్యంలో ఎపి, ఒడిశాలో బలోపేతమయ్యే దిశగా మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నట్టు కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగం సమాచారం. గతేడాది ఎపిలో మావోయిస్టు కార్యకలాపాలు 94 శాతం పెరిగినట్టు కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

07/31/2016 - 06:25

నెల్లూరుసిటీ, జూలై 30: నెల్లూరు నగరపాలక సంస్థలోని సిటీ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, 3 టిపిఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర టౌన్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ రఘు శుక్రవారం రాత్రి 7 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుతో పాటు వారి స్థానంలో కొత్తవారిని కూడా యుద్ధ ప్రతిపాదికన నియమించడం విశేషం.

07/31/2016 - 06:24

నెల్లూరు, జూలై 30: నెల్లూరు జిల్లా ఆడిట్ అధికారి లంచం తీసుకుంటూ శనివారం ఏసిబి అధికారుల చేతికి చిక్కాడు. నెల్లూరు జిల్లా ఆడిట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న బూడిద వెంకసుబ్బయ్య మృతిచెందడంతో అతని భార్యకు పింఛను వచ్చేది. ఆమె కూడా ఇటీవల మృతిచెందడంతో అవివాహిత అయిన ఆమె కుమార్తెకు ఆ పింఛన్ మంజూరు చేయాలని వెంకటసుబ్బయ్య కుమారుడు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశాడు.

07/31/2016 - 06:23

విజయవాడ, జూలై 30: రాజధాని అమరావతి నగర పరిధిలోని ఆరు గ్రామాలకు సంబంధించిన భూ సమీకరణ పథకం (ఎల్పీఎస్) లేఅవుట్ల ముసాయిదా ప్రకటనను ఏపి సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ శనివారం నాడిక్కడ విడుదల చేశారు. వీటిని ఆయా పంచాయతీ కార్యాలయాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పత్రికా ముఖంగానూ, గుంటూరు జిల్లా, ఏపి సిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లోనూ ప్రకటించడం జరిగింది.

07/31/2016 - 06:50

మచిలీపట్నం, జూలై 30: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ హోంగార్డు తన ఇద్దరు పిల్లలు సహా అదృశ్యమయ్యాడు. శనివారం చిన్నారి మృతదేహం లభ్యం కావటంతో పిల్లలతో సహా అతను సాగర సంగమం వద్ద నదిలో దూకి వుంటాడని భావిస్తున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన యడ్లపల్లి వెంకట రమేష్ బాబు(32) చల్లపల్లి పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రమేష్ కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి.

Pages