ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంతో రాజీ ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 30: అనైతికంగా, అన్యాయంగా జరిగిన విభజన కారణంగా అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో, ప్రత్యేక హోదా, నిధులు, పథకాల మంజూరులో కేంద్ర ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తే లేదని జిల్లా ఇన్‌చార్జి, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేసారు. అలా అని కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపడే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో వ్యహరిస్తూనే రాష్ట్రానికి అన్ని డిమాండ్లను సాధించుకుంటామన్నారు. జిల్లా పర్యటన సందర్భంగా శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విభజన నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అన్ని హామీలను అమలుచేయాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రం నుంచి రావలసిన రాయితీలు, నిధులు, పథకాలపై అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వేపై కొన్ని వర్గాలు ప్రజల్లో అపోహలు కల్పిస్తున్నాయని ఆరోపిస్తూ సర్వే విషయంలో ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడడమే తప్పా వారి పొట్టకొట్టాలని ప్రభుత్వం భావించడం లేదన్నారు. తెలంగాణలో ఎంసెట్ పరీక్ష లీకేజీ, పరీక్ష రద్దుపై విలేఖరులు అడిగి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ప్రశ్నా పత్రం లీకైన సందర్భంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్ష నిర్వహించక తప్పదని చెప్పారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యే చిరంజీవులు, కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రఘునాథరెడ్డి