ఆంధ్రప్రదేశ్‌

కల నెరవేరింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: నటనతోనే కాదు.. తనను ఆదరించే అభిమానుల ఆకాంక్షనూ తీర్చడంలోనూ తనకు తానే సాటిగా నిరూపించుకున్నారు. యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. తనను కలవాలనుకున్న ఓ క్యాన్సర్ రోగిని పలకరించారు. అంతేకాకుండా తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులనూ కలుసుకునే అవకాశం కల్పించారు. బెంగుళూరుకు చెందిన నాగార్జున ఎప్పటికైనా తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను కలవాలన్నది అతని కోరిక. అయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నాగార్జున బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ శనివారం బాధిత రోగిని కలుసుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. కాగా ఎన్టీఆర్‌ను కలవాలనే కల నెరవేరిందని తన అభిమాన నటుడిని కలుసుకోగలిగానంటూ నాగార్జున ఉబ్బితబ్బిబ్బై సంతోషం వ్యక్తం చేశాడు.

చిత్రం..క్యాన్సర్ వ్యాధిగ్రస్థుడు నాగార్జున తన కుటుంబ సభ్యులతో
కలిసి ఎన్టీఆర్‌తో భేటీ అయన దృశ్యం