ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 30: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ హోంగార్డు తన ఇద్దరు పిల్లలు సహా అదృశ్యమయ్యాడు. శనివారం చిన్నారి మృతదేహం లభ్యం కావటంతో పిల్లలతో సహా అతను సాగర సంగమం వద్ద నదిలో దూకి వుంటాడని భావిస్తున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన యడ్లపల్లి వెంకట రమేష్ బాబు(32) చల్లపల్లి పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రమేష్ కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంతో అతను పిల్లలను తీసుకుని సాగర సంగమం వద్ద నదిలో దూకి ఉంటాడని భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలు తరుణ్ కార్తీక్(7), శ్రావ్య(4)లకు తాయత్తు కట్టించి తీసుకొస్తానని ఇంట్లో చెప్పి తన ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకెళ్లాడు. రాత్రి పొద్దుపోయినా వీరు తిరిగి రాకపోవటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెదకటం ప్రారంభించారు. శనివారం రమేష్ కుమార్తె శ్రావ్య మృతదేహం కోడూరు మండలం సాగర సంగమం ప్రాంత సమీపంలో సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. తండ్రీ, కొడుకుల కోసం మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా వీరి ఆచూకీ లభ్యం కాలేదు. శ్రావ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అవనిగడ్డ డిఎస్పీ సయ్యద్ ఖాదర్ బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..సాగర సంగమ ప్రాంతంలో లభ్యమైన చిన్నారి శ్రావ్య మృతదేహం