ఆంధ్రప్రదేశ్‌

ఏసిబి వలలో ఆడిట్ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 30: నెల్లూరు జిల్లా ఆడిట్ అధికారి లంచం తీసుకుంటూ శనివారం ఏసిబి అధికారుల చేతికి చిక్కాడు. నెల్లూరు జిల్లా ఆడిట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న బూడిద వెంకసుబ్బయ్య మృతిచెందడంతో అతని భార్యకు పింఛను వచ్చేది. ఆమె కూడా ఇటీవల మృతిచెందడంతో అవివాహిత అయిన ఆమె కుమార్తెకు ఆ పింఛన్ మంజూరు చేయాలని వెంకటసుబ్బయ్య కుమారుడు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఆమెకు పింఛను మంజూరుకు 50వేలు జిల్లా ఆడిట్ అధికారి నల్లపరెడ్డి షణ్ముఖరెడ్డి లంచం డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బేరం ఆడి 30వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈవిషయాన్ని ఎసిబి అధికారులకు సమాచారం అందించడంతో వారు షణ్ముఖరెడ్డి కదలికలపై నిఘా వేశారు. తాను లంచం నేరుగా తీసుకోకుండా కార్యాలయంలో పనిచేసే మరో ఉద్యోగి వహీద్ బాషా ద్వారా బాధితుడునుంచి 30 వేలు వసూలు చేస్తుండగా నెల్లూరు ఏసిబి డిఎస్పీ తోట ప్రభాకర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు.