ఆంధ్రప్రదేశ్‌

ఎవరినీ వదలిపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 27: కావేరి సీడ్స్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే కేసులు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు నాసిరకం విత్తనాలపై సంస్థ యాజమాన్యం స్పందించక పోవడంతో అనుమానాలు బలపడుతున్నాయన్నారు. బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఆ విత్తనాలను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామన్నారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఆ కంపెనీ విక్రయాలు జరగకుండా అడ్డుకుంటామన్నారు. కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయవాడ, గుంటూరు, అమరావతిలో పుష్కరనగర్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకున్న ప్రతిపక్ష నాయకులకు దాని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ ప్రాజెక్టు లేకపోతే గత ఏడాది కృష్ణాడెల్టాలో రైతులు పంటలను పూర్తిగా నష్టపోయేవారన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరినాట్లకు అందిస్తామన్నారు. నాగార్జునసాగర్ నుండి నీరు విడుదల చేసి మంచినీటి చెరువులను నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. వైకాపా నాయకులు కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పినా సిగ్గురాలేదని మండిపడ్డారు. కృష్ణా పుష్కరాల్లో సేవాభావంతో పనిచేసే అందరినీ కలుపుకుంటామన్నారు. ప్రభుత్వం రూ.1477 కోట్లతో పనులు చేపట్టిందని, కాంట్రాక్టర్లు, నాసిరకంతో పనిచేస్తే బిల్లులు చెల్లించేది లేదని, సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. పుష్కరాల్లో భక్తులకు సేవలందించేందుకు స్వచ్చంధ సంస్థలు, ఇతర అసోసియేషన్లతో త్వరలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.