ఆంధ్రప్రదేశ్‌

ల్యాండ్‌హబ్ అథారిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక సమాచారం మొత్తం డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించి రూపొందిస్తున్న ల్యాండ్‌హబ్‌లో సమస్త భూముల వివరాలు పొందుపరచాలని సూచించారు. సిఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి రెవెన్యూ సంస్కరణలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు కొన్ని సూచనలు చేశారు. భూముల సమగ్ర నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక హబ్‌ను ఏర్పాటు చేయాలని ఆధార్ యుఐడిఎఐ తరహాలో ఒక అధీకృత ఏజెన్సీ ఉండాలని యోచిస్తున్నట్టు చెప్పారు. రెవెన్యూ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, వక్ఫ్ ల్యాండ్, మున్సిపల్ అర్బన్ ల్యాండ్ సర్వే వివరాలన్నీ ల్యాండ్‌హబ్‌లో చేర్చాలని సిఎం ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలు మొత్తం ఈ హబ్ ద్వారా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి తెలిసేలా వివరాలు పొందుపరచాలన్నారు. మొత్తం 1,60,000 చదరపు కిలోమీటర్ల రాష్ట్ర భౌగోళిక ప్రాంతమంతా ఈ ల్యాండ్‌హబ్ పరిధిలోకి రావాలని ఆయన సూచించారు. రైతులకు ప్రభుత్వం తరపున అందే ప్రతి ప్రయోజనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు డిజిటలైజ్ ప్రక్రియను చేపట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త అర్బన్ మండలాలు, రెవెన్యూ డివిజన్‌ల గురించి మాట్లాడుతూ ఈ విషయంలో పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య విరుద్ధమైన భౌగోళిక సరిహద్దులుండరాదని ముఖ్యమంత్రి సూచించారు. రెవెన్యూ డివిజన్‌లు ఎన్ని ఉంటే పోలీస్ డివిజన్లు కూడా అనే్న ఉండాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయని, వీటి సంఖ్యను పెంచే విషయంలో రెండు శాఖల మధ్య సమన్వయం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ-క్రాప్ విధానంలో ఇక సెల్ఫీలతో పంటలకు సంబంధించిన ఫోటోలు పొందుపరచాలని అధికారులకు సిఎం సూచించారు. వ్యవసాయం చేసే వారికే రుణాలు అందాలన్నదే ప్రభుత్వ విధానమని, ఈ విషయంలో భూమి పట్టాదారులకు సమస్యలు తెలెత్తకుండా వెబ్ ల్యాండ్‌లో ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు. ల్యాండ్ రికార్డులను ఆధార్ వివరాలతో అనుసంధానం చేసింది మన రాష్టమ్రేనని సిఎం గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో రెవెన్యూ శాఖలో 13 సంస్కరణలు చేపట్టామని సమావేశంలో తొలుత మాట్లాడిన రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన ఇతర పట్టాదారులకు సంబంధించి మరోమారు 1బిలు అందించి వారి సమస్యలను పరిష్కరించాలని సిఎం ఆదేశించారు. 73.37 లక్షల మంది రికార్డుల పరిశీలన పూర్తయిందని అధికారులు సిఎంకు చెప్పారు. ఆ రికార్డులను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ రికార్డులన్నింటికీ డిజిటల్ లాకర్ ఉండాలని, వాటిలో ఏ మార్పులు జరగాలన్నా సవరణలకు ఆర్డీవోలు మాత్రమే అధారిటీగా ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు.
మండల కార్యాలయం నుంచి సిసిఎల్ వరకు ప్రతి ఫైలును ఆన్‌లైన్ చేయాలని ఆయన సూచించారు. 6.4 లక్షల ఎకరాల భూమిని ఇటిఎస్ ద్వారానే సర్వే చేశామని అధికారులు సిఎంకు తెలియజేశారు. డ్రోన్ టెక్నాలజీని కూడా ప్రవేశపెడుతున్నామని అధికారులు చెప్పారు. సర్వేను ఎవరు అడ్డుకున్నా ఉపేక్షించేది లేదని సిఎం హెచ్చరించారు.

చిత్రం... సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు