ఆంధ్రప్రదేశ్‌

బయోమెట్రిక్ వద్దు అర్చక సమాఖ్య డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: రాష్ట్రంలో 6(ఎ) కేటగిరీకి చెందిన ఆలయాల్లోని అర్చకులకు బయోమెట్రిక్ విదానం ద్వారా హాజరు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఖండించింది. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు దేవాదాయ కమిషనర్‌ను డిమాండ్ చేశారు. అర్చకుల సేవలు ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లాంటివి కావని, వారికి సెలవులు, పర్వదినాలులేవని సుప్రీం కోర్టు 1997లో ఇచ్చిన తీర్పులో పేర్కొందని, తెల్లవారు జామునే విధులు ప్రారంభించే అర్చకులు రాత్రి పొద్దుపోయే వరకు పనిచేయాల్సి ఉంటుందని, కనుక వారికి ప్రత్యేక సర్వీసు నిబంధనలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను ఆదేశించిందని వారు తెలిపారు. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పాటించలేదన్నారు.