ఆంధ్రప్రదేశ్‌

ట్రాన్స్‌కో జెఎండిగా దినేష్ పరుచూరి నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ పరుచూరి దినేష్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ రంగం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తిచేసేందుకు అందరి సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాన్స్‌కో జెఎండిగా నియమితులైన పరుచూరి దినేష్‌ను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్‌కో సిఎండి కె.విజయానంద్ అభినందించారు.

రెండో రోజూ శ్రీశైలంనుంచి నీటి విడుదల

కర్నూలు, జూలై 29: శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు నీటి తరలింపు రెండవరోజు శుక్రవారం కొనసాగింది. కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 10 టిఎంసిల నీరు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా శుక్రవారం 12,714 క్యూసెక్కులకు పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 810.6 అడుగులకు చేరుకోగా 34.65 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 32 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. కాగా శ్రీశైలం నీటి విడుదలపై రాయలసీమవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మట్టానికి కూడా నీరు చేరకముందే తాగునీటి పేరుతో దిగువకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కర్నూలులో ర్యాలీ నిర్వహించి ధర్నా చేయనున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి.
ఏపీకి నీటి విడుదల
నాగార్జునసాగర్: కృష్ణాబోర్డు ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ నుంచి శుక్రవారం అధికారులు ఆంధ్రకు నీటి విడుదలను ప్రారంభించారు. శ్రీశైలం నుంచి వచ్చే 10 టిఎంసిలలో తాగునీటి కోసం ఆంధ్రకు ఏడు టిఎంసిలు, హైదరాబాద్‌కు మూడు టిఎంసిలు విడుదల చేయాలని కృష్ణాబోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే.

గవర్నర్‌తో డిజిపి భేటీ

హైదరాబాద్, జూలై 29: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కొత్త డిజిపి నండూరి సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులను వివరించారు. డిజిపిగా నియమితులైన సాంబశివరావును గవర్నర్ నరసింహన్ అభినందించారు.