ఆంధ్రప్రదేశ్‌

2న రాష్ట్ర బంద్‌కు వైకాపా పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ వైఖరికి, బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న టిడిపి ధోరణికి నిరసనగా ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను బిజెపి మోసం చేసిందని, కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కై పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజన తంతును పూర్తిచేశాయని ఆయన ధ్వజమెత్తారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరుపతి సభలో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరికి 5 కోట్ల మంది ఆంధ్రులను మోసగించారని, అందుకే రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తున్నామని జగన్ వివరించారు.

లాడ్జిలో రూ.35 లక్షలు స్వాధీనం

హైదరాబాద్, జూలనై 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసన్న కుమార్‌కు డిఇడి కాలేజీల యాజమాన్యానికి మధ్య మధ్యవర్తిగా ఉన్న రఫీ బస చేసిన లాడ్జి గదిలో ఎసిబి పోలీసులు శుక్రవారం సోదాలు జరిపి రూ.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంతవరకు పోలీసులు ప్రసన్నకుమార్‌తో పాటు రఫీ నుంచి రూ.44.65 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎసిబి డైరక్టెర్ జనరల్ తెలిపారు.
ప్రసన్న కుమార్‌పై క్రిమినల్ కేసును నమోదు చేశారు. రాష్ట్రంలో డిఇడి కాలేజీలకు ఎంపికైన విద్యార్థుల జాబితాకు సంబంధించి డిఇడి కాలేజీల యాజమాన్యం నుంచి విద్యార్థికి వెయ్యి రూపాయల చొప్పున సొమ్ము చెల్లించాలని ప్రసన్న కుమార్ వత్తిడి తెస్తున్నట్లు ఎసిబికి ఫిర్యాదు అందింది.

కాపు రిజర్వేషన్లపై సిఎంకు చిత్తశుద్ధి లేదు
కాంగ్రెస్ నేతల ఆరోపణ
విజయవాడ, జూలై 29: ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ఇతర వర్గాలను బిసిలుగా గుర్తించాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబులో ఏ కోశానా కన్పించడం లేదంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుబంధ కాపు రిజర్వేషన్ సాధికారిత విభాగం నేతలు నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు పనిచేసిన పలు కమిషన్‌లకు భిన్నంగా తొలిసారిగా జస్టిస్ మంజునాథ కమిషన్‌కు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా అన్నింటినీ కత్తిరించి కేవలం ప్రభుత్వం అందించబోయే సమాచారం ప్రకారమే తమకు నివేదికను సమర్పించాలని ఆదేశించడం దారుణమన్నారు. కాపులను బిసిలుగా గుర్తించే ప్రక్రియను సత్వరం పూర్తిచేసి సమగ్ర నివేదికను అందించాలంటూ లింగంశెట్టి ఈశ్వరరావు నాయకత్వంలో 13 జిల్లాల కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఆంధ్రరత్న భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి బిసి కమిషన్ కార్యాలయంలో చైర్మన్ లేకపోవటంతో సభ్యులకు వినతిపత్రాలు అందింజేశారు. ఈ సందర్భంగా లింగంశెట్టితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పక్కాల సూరిబాబు, ఆకుల శ్రీనివాసకుమార్, నరహరశెట్టి నరసింహారావు తదితరులు మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఏ కమిషన్ అయినా జిల్లాలో పర్యటించి శాంపిల్ సర్వేలు నిర్వహించి తాము గమనించింది, గుర్తించింది దృష్టిలో పెట్టుకుని నివేదికలు అందించడం జరిగేది. అయితే ప్రస్తుత బిసి కమిషన్ విషయంలో ఇంటింటా జరుగుతున్న స్మార్ట్ సర్వే అనంతరం సమాచారం అందిస్తాం.. ఆ ప్రకారం నివేదిక అందించండి అంటూ ప్రభుత్వం ఆదేశించినట్లుగా సభ్యులే చెబుతున్నారు. ఇక ఈ కమిషన్ జిల్లాల్లో పర్యటించి పబ్లిక్ హియరింగ్ జరిపినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. గతంలో మండల్ కమిషన్ తరహాలోనే సర్వే జరిపి నివేదిక అందించాలని వారు డిమాండ్ చేశారు.