S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

08/04/2018 - 19:48

ఆంధ్రభూమి వెనె్నల సమీక్షలో ‘విజేతకాదు పరాజితుడు’ అంటూ హీరో నటన ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. అయితే అల్లుడ్ని పొగడాల్సిన అవసరం ఉన్న చిరంజీవి ‘ఇది ఎడ్యుకేటివ్ ఫిలిం. కళ్యాణ్‌దేవ్ ఎక్కడా బెదురులేకుండా పరిణితితో సెటిల్డ్‌గా నటించాడు’అని దండోరావేస్తే అల్లు అర్జున్ కూడా తనవంతు పొగడ్తలు గుప్పించాడు. ఆయనకు విజేత బాగా నచ్చిందట.

07/28/2018 - 19:03

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ని వివాదాస్పద వ్యక్తి అని చెబుతుంటారు. అది తప్పు. ఎవరేమనుకున్నా నేను నిజమే చెప్తాను. దాన్ని మీడియా వివాదాస్పదం చేస్తుంది అంటుందామె. మీరు మద్యం, మాదక ద్రవ్యాలకు బానిస అయ్యారట అని సూటిగా అడిగిన విలేఖరికి సూటిగానే చెప్పింది. నేను పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నాకు గైడెన్స్ లేకపోయింది. సినిమా ఛాన్సులకోసం స్టూడియోల చుట్టూ తిరిగేటప్పుడు కొన్నిసార్లు మద్యం, డ్రగ్స్ తీసుకున్నా.

07/21/2018 - 19:02

నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన అలనాటి మేటి నటి ‘సావిత్రి’ బయోపిక్ ‘మహానటి’ ఆద్యంతం దృవ్యకావ్యంలా అనిపించింది. బయోపిక్ చిత్రాలు తీయాలంటే ఈ చిత్రం ఓ దిక్సూచిలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. చిత్రంలో కీర్తిసురేష్ నటన చూస్తే సావిత్రే దిగివచ్చి నటించిందా? అనిపించింది. కీర్తిసురేష్‌కు ఈ చిత్రానికి తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందనిపించింది.

07/14/2018 - 18:39

హాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల ఎమీ అవార్డ్స్ వేడుకలో ‘్భరతీయ చిత్రాల్లో ఎక్కువ భాగం మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టే తిరుగుతాయి’అని చెప్పి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయింది. వెంటనే క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. నిజానికి ఆమె చెప్పిన మాటలో తప్పేముంది?

07/14/2018 - 18:36

నాగ్ కెరీర్‌లోనే మాయని మచ్చ!

07/07/2018 - 23:41

మూడేళ్ల క్రితమే కథ తయారైనా ఆ కథను విన్న హీరోలకు అది నచ్చక చివరకు ఒక ఎన్నారై బకరా సినిమా తీస్తానని ముందుకు రాగా రవితేజని కలిసి అతని స్థాయికి మించి 12కోట్లు ఇస్తామనగానే కథ విన్నాడో లేదో గాని మాస్ మహారాజా వెంటనే ఒప్పుకున్నాడు. అలా ‘నేల టికెట్’ తయారైంది. ఇది నేల టికెట్ ఆడియన్స్‌నేకాక బాల్కనీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చుతుందని రవితేజా బాకా వాయించినా ఏ ప్రేక్షకులనూ అలరించలేక పోయింది.

06/30/2018 - 21:36

మహానటి చిత్రంలో కీర్తిసురేష్ సావిత్రి పాత్రను నిజంగా మనం సావిత్రిగా ఫీలవుతాము. దర్శకుడు క్రిష్ పాత్రతో కె.వి.రెడ్డి సావిత్రిలో ఒక కంట కన్నీరు కురిపించాలని రెండో కన్నులో ఎలాంటి భావం ఉండవద్దని చెబితే ఒకే షాట్‌లో లీనమైన సావిత్రి జీవితంలోని రెండో కన్ను కూడ కన్నీళ్ళమయమైంది.

06/23/2018 - 22:03

మీ వ్యూస్
=======

06/16/2018 - 20:18

గత కొనే్నళ్లుగా హిట్ సినిమా ఎరుగని వెటరన్ యాక్టర్ రవితేజకి తాజా చిత్రం ‘నేల టికెట్’ ఫలితం ‘నేలమట్టం’ అయిన తీరున అట్టర్‌ఫ్లాప్ అయ్యి, అతగాడ్కి తీవ్ర నిరాశని మిగిల్చింది. కాలానికి తగ్గరీతిన, తననుతాను మలచుకోగల్గితేనే మనిషికి ఏ రంగంలో అయినా విజయం సాధ్యం అవుతుంది. రవితేజ గత 15, 16 ఏళ్లుగా అదే వెటకార పూరిత నటనతో ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుండటంతో అతని చిత్రాలు ఫట్‌మంటున్నాయి.

06/09/2018 - 21:34

‘మహానటి’- రంగస్థలం, భరత్‌ల మాదిరి సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకుల మన్నన పొంది హిట్ అయింది. తమాషా ఏమంటే చిత్ర నిర్మాతలు గాని దర్శకుడు గాని మహానటి సావిత్రి మరణించే నాటికి పుట్టనే లేదు. నిర్మాతలు ప్రియాంక, స్వప్నల తల్లి, తాతగారు ఎక్కువగా సావిత్రి నటించిన చిత్రాలు చూస్తూ ఆమె గొప్పదనం వారికి చెప్తూ ఉండేవారు. అయితే ప్రియాంక భర్త నాగఅశ్విన్ సావిత్రి బయోపిక్ తీస్తాననగానే ఆ సోదరీ మణులు ఉలిక్కిపడ్డారు.

Pages