S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

08/17/2019 - 20:50

గడపలోపల గుడ్‌బోయ్. గడప దాటితో ప్లేబోయ్ కానె్సప్ట్‌తో -అల్లుకున్న మన్మథుడు కథ బావుందిగానీ, ఆ పాత్ర పోషించిన నాగార్జునకు ఏమాత్రం సూట్‌కాలేదు. వయసుపై సెటైర్లు వేసుకున్నంత మాత్రాన -తగని పాత్రను పోషిస్తే చప్పట్లు కొట్టేస్తారనుకోవడం అపోహ. నాగార్జున కెరీర్ ఎక్కడ మొదలైంది.. ఎక్కడి వరకూ జర్నీ చేసిందన్నది -కామన్ ఆడియన్‌కు కొత్త విషయమేం కాదు.

08/10/2019 - 20:23

ఫ్లాపుల్లోవున్న హీరోల సుడి తిరుగుతోంది. అందుకే ఆమధ్య రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టయితే, మొన్ననే వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘రాక్షసుడు’ సెనె్సషనల్ హిట్టై కూర్చుంది. తమిళ ‘రాచ్చసన్’కు తెలుగు రీమేక్ అయినా -దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన విధానం ఆడియన్స్‌కి బాగా కనెక్టైంది. మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా -బెల్లంకొండ మళ్లీ నాలుగు సినిమాలు చేసుకునే అవకాశం ఇచ్చినట్టే.

08/03/2019 - 20:29

మీ వ్యూస్‌లో -విమర్శలు, ప్రశంసలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. చదువుతుంటే సంతోషం అనిపిస్తుంది. ఈమధ్య ‘సింబా గర్జించాడు’ అంటూ వెనె్నలలో ప్రచురించిన రివ్యూ చాలా చాలా బావుంది. రివ్యూ చదువుతుంటే సినిమాని బాగా ఆకళింపు చేసుకొని తిరిగి కథ చెబుతున్నంత హాయిగా అనిపించింది. రచయిత విజయప్రసాద్ రాసిన విధానం ఆకట్టుకుంది. సినిమా సక్సెస్‌కు ఇచ్చినట్టే -సమీక్షకూ మూడు నక్షత్రాలివ్వాలి.

07/27/2019 - 19:46

దర్శకుడు పూరి జోష్ మీదున్నాడు. హీరో రామ్ అంతకంటే ఊపులో ఉన్నాడు. కారణం -‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టు. సినిమా ఫలితం కంటే -వసూళ్ల జోరే ఇద్దరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. విడుదలకు ముందు అనేక కోణాల్లో పూర్తి నెగెటివిటీ మూటగట్టుకున్న ఇస్మార్ట్.. విడుదల తరువాత థియేటర్లలో చెలరేగిపోయాడు. పూరి పనైపోయిందని అనుకున్న ప్రతిసారీ ఓ హిట్టుతో ట్రాక్‌పైకి వస్తోన్న ప్రక్రియే మళ్లీ కొనసాగింది. బూతులెక్కువున్నాయా?

07/20/2019 - 20:27

‘మణికర్ణిక’ నుంచి క్రిష్ తప్పుకునేలా అవమానించిన కంగన, ఇప్పుడు ‘మెంటల్ హై క్యా?’ తెలుగు దర్శకుడు కోవెలమూడి ప్రకాశ్‌నీ అవమానిస్తోందని, అందుకే సినిమా విడుదల ఆలస్యమవుతోందని గగ్గోలు పెట్టిందొక పత్రిక. అయతే, మానసిక వికలాంగులను మెంటల్ అనడం తగదంటూ సైకియాట్రిస్టుల సంఘం కోర్టుకు వెళ్తామని నిర్మాతలను హెచ్చరించింది. ఈమధ్యనే సెన్సార్ బోర్డు కూడా చిత్రాల్లో మెంటల్ అనే పదం వాడరాదని చెప్పింది.

07/13/2019 - 20:41

యూత్ సినిమా అంటే బూతు సినిమా అని, అసలు వలువలకు విలువలేదని తెలియజెప్పే ప్రయత్నం చేసింది ఆమధ్య వచ్చిన ‘హిప్పీ’. సినిమా ఆసాంతం తలాతోకా లేకుండా, అసలు చెప్పాలంటే కథని గాలికి వదిలేసి ముద్దులు, బూతు డైలాగులు, వళ్ళు చూపించడం లాంటివి వుంటే సినిమా పాసయి పోతుందన్న ధీమాతో యూత్‌పైకి ఈ వి(వ)లువల్లేని సినిమాని వదిలారు. అసలు ‘హిప్పీ’ద్వారా ఏం చెప్పాలనుకున్నారో సినిమా తీసినోళ్లకే అర్థమై ఉండదు.

07/06/2019 - 20:11

సాధారణంగా బయోపిక్‌లు ప్రజాదరణ పొందిన వ్యక్తులపై తీస్తారు. కానీ చాలామందికి తెలీని అతి సామాన్య వ్యక్తిపై బయోపిక్ తీసి ‘వహ్వా’ అనిపించారు. అదే -చేనేతన్న చింతకింది మల్లేశం కథ. సినిమాగా వచ్చిన శ్రమజీవి మల్లేశం కథలో సహజత్వం ఉట్టిపడింది. నేతన్నలు వృత్తిలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించటంలో దర్శకుడు రాజ్ ఆర్ ప్రతిభ కనిపించింది.

06/29/2019 - 19:58

ఓ గొప్ప ఆవిష్కరణ అనేది బాధనుంచో, భారంనుంచో పుడుతుంది. మల్లేశం కనుక్కున్న ఆసు యంత్రం కూడా అలాంటిదే. తమ వృత్తికవసరమైన శారీరక శ్రమను తగ్గించే ఆవిష్కరణ కోసం ఓ వ్యక్తి సజీవ పరితపనకు తెర రూపమే -మల్లేశం. చాలాకాలం తరువాత ఓ స్ఫూర్తివంతమైన సినిమా చూశామన్న భావన కలిగింది. సమీక్షకులు ఎన్ని విధాలుగా సమీక్షించినా, కామన్ ఆడియన్‌గా ఈ చిత్రం సంతృప్తినిచ్చింది.

06/22/2019 - 20:19

‘సీత’ చిత్ర దర్శకుడు ఒక మేవరిక్ అని ఒక పత్రిక అభివర్ణించింది. మేవరిక్ అంటే స్థిర అభిప్రాయాలు లేని చంచల చిత్తుడు లేదా పిచ్చోడు అని అర్థం. కాజల్ చక్కగా నటించినా సీత పాత్రను దర్శకుడు సరిగా మలచలేక పరాజయం మూటకట్టుకున్నాడని మరో పత్రిక కథనం. మన వెనె్నల సీతకు సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇన్ని వాతలుపడినా కాజల్ ఏమంటున్నదో చూడండి! ‘సీత’తో పిహెచ్‌డీ చేసే అవకాశం వచ్చింది.

06/15/2019 - 20:55

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ నటించిన -సీత.. ప్రస్తుత మానవత్వ సంబంధాల పరిస్థితిని తేటతెల్లం చేసింది. డబ్బు పిచ్చిపట్టి విలన్‌గా ప్రవర్తించే పాత్రలో కాజల్ నటన బావుంది. ఆ పిచ్చిలో పడి.. అవసరమైతే సహజీవనానికి తెగబడటం, అందుకు అగ్రిమెంట్ రాసుకోవడం లాంటి సన్నివేశాలు వాస్తవ పరిస్థితిని తేటతెల్లం చేశాయి. సీతను టార్చర్‌పెట్టే పాత్రలో బసవరాజుగా సోనుసూద్ అద్భుతంగా చేశాడు.

Pages