S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

05/04/2019 - 19:47

కొత్త ఏడాది ఆరంభం నుంచీ కుంటుకుంటూ నడుస్తున్న తెలుగు సినిమాకు -ఏప్రిల్ నెలలో పూనకం వచ్చినట్టే కనిపిస్తోంది. గత మూడు నెలల్లో చెప్పుకోడానికి ఎఫ్-2 తప్ప ఒక్క సినిమా కూడా లేదు. కానీ, ఏప్రిల్‌లో మాత్రం మూడు సినిమాలు గొప్ప విజయాలు సాధించి పరిశ్రమకు కొత్త ఊపునిచ్చాయి.

04/27/2019 - 20:49

ఆర్భాటంగా నిర్మించిన బయోపిక్ కథానాయకుడు ఫ్లాప్ అయితే మహానాయకుడు డిజాస్టర్‌గా మిగిలింది. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ విమర్శకుల మెప్పు పొందినా కాసులు రాలలేదు. ఘంటసాల బయోపిక్ నిర్మాణం పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. తక్కువ బడ్జెట్‌తో తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయింది. ఆంధ్రలో విడుదల అయ్యాక కొద్దిపాటి లాభాలు రావచ్చేమో. గొప్ప హిట్ మాత్రం కాదు.

04/20/2019 - 20:40

వరుసగా ఆరు ఫ్లాపులు చూసిన హీరో సాయితేజ్. అందుకే కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కథలపై ఫోకస్ పెడుతున్నాడు. గతవారం వచ్చిన చిత్రలహరి కథతో నిజానికి మెగా అన్న ఇమేజ్ వదిలి ప్రయోగమే చేశాడని చెప్పాలి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రచారం చేసుకునేంత గొప్ప హిట్టని అనలేంకానీ, సాయతేజ్ నీరసాన్ని తగ్గించే వూపునిస్తుందని మాత్రం చెప్పొచ్చు.

04/13/2019 - 20:39

ప్రేమ విఫలమై దూరమైన అమ్మాయ, అబ్బాయ కొత్త జీవితం మొదలుపెట్టిన తరువాత మళ్లీ ఆ జీవితంలోకి రావడం..లాంటి ఇతివృత్తాలతో తెలుగులో చాలా కథలే వచ్చినప్పటికీ, అలాంటి కథతో మజిలీ చిత్రాన్ని నడిపించిన విధానం చాలా బావుంది. చాలాకాలం తరువాత ఓ మంచి తెలుగు సినిమా చూశామన్న భావన కలిగింది. దర్శకుడు శివ నిర్వాణ కథను నడిపించిన తీరు, ఆయా పాత్రల్లో ముఖ్య పాత్రలు ఒదిగిన విధానం మనసుకు హత్తుకుంది.

04/07/2019 - 22:52

అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ‘బాహుబలి’ సృష్టికర్త రాజవౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎంతవరకు సబబు? తెలుగు జాతికి స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తిని రగిల్చి, మన్యాన్ని ఉద్యమకేంద్రంగా మార్చి బ్రిటిష్ వారిపై పోరాడిన మన్యంవీరుడు ‘అల్లూరి సీతారామరాజు’. గిరిజనుల స్వాతంత్య్రంకోసం పోరాడి వారిని బానిస దాస్య శృంఖలాలనుండి కాపాడిన తెలంగాణాయోధుడు ‘కొమరంభీమ్’.

03/30/2019 - 20:53

ఆదివారం వచ్చిందంటే చాలు ఆంధ్రభూమి ముందుగా చూడాల్సిందే. ‘సరయుశేఖర్’గారి ఫీచర్, ఫ్లాష్‌బ్యాక్ ఎట్ 50, మీవ్యూస్, కొత్త సినిమాల రివ్యూస్, ఇంకా ‘నాకునచ్చిన చిత్రం’, ‘పాట’, ‘ఇమంది’గారి జ్ఞాపకాలు ఇలా ఏవైనాసరే అన్నీ మాకు నచ్చేవే! ఇలాంటి శీర్షికలు మరిన్ని పెంచి వెనె్నలకు మరింత చల్లదనాన్ని ఆపాదిస్తారని ఆశిస్తున్నాం.

03/23/2019 - 20:20

ఏడాది ఆరంభంలో పండుగ సీజన్. వచ్చేది వేసవి సీజన్. ఈ సీజన్లను పెద్ద చిత్రాలు ఆక్రమించటంతో -్ఫబ్రవరి, మార్చి నెలల్లో చిన్న సినిమాలు థియేటర్ల వద్ద వరుస పెడుతున్నాయి. అయితే, వీటిలో ఏ ఒక్క చిత్రమూ ప్రేక్షకుల సినిమా ఆకలిని సంతృప్తిపర్చలేకపోయింది. మార్చి నెలనే తీసుకుంటూ కల్యాణ్‌రామ్ 118 ఏదో ఫరవాలేదు అనిపిస్తే, బొట్టు, మ్యాగ్నెట్, వేరీజ్ వెంకటలక్ష్మి, బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్..

03/16/2019 - 20:15

తీసినవి తక్కువే అయినా, చెక్కు చెదరని సినిమాలు తీశాడు రాజీవ్ మీనన్. ఆ విషయాన్ని ‘సర్వం తాళమయం’తో మరోసారి రుజువు చేశాడు. పదిహేడేళ్ల గ్యాప్ తరువాత మెగాఫోన్ పట్టుకున్నా, సన్నివేశాన్ని నడిపించటంలోని సున్నితత్వం ఏమాత్రం దెబ్బతినకుండా ‘సౌవర్ణ శోభిత సంగీతం.. వర్ణ వైషమ్యాలకు అతీతం’ అన్న పాయింట్‌ను అద్భుతమైన కథగా చెప్పటం అతని ప్రతిభకు తార్కాణం.

03/09/2019 - 23:28

అదే పెద్ద తప్పు

03/02/2019 - 20:31

గత వెనె్నల సంచికలో ‘కొత్తదనమే ఇష్టం’ అంటూ ప్రచురించిన కల్యాణ్‌రామ్ ఇంటర్వ్యూ బావుంది. అందరు హీరోలు చెప్పినట్టుకాకుండా -కల్యాణ్ నిజాయితీగానే చెప్పాడనిపిస్తుంది. అతని కెరీర్‌లో ఎన్నో సినిమాలు ఫ్లాపులైనా -ప్రతి సినిమాలోనూ ఏదోక కొత్తదనం చెప్పడానికి, చూపించడానికీ తాపత్రయపడతున్నట్టు ఆడియన్స్‌కి అర్థమవుతూనే ఉంది.

Pages