S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

12/15/2018 - 20:23

ప్రతి సినిమాకీ ముందు మీడియా వద్ద తన స్టామినా చెప్పుకునే కుర్ర హీరో బెల్లంకొండ సాయ శ్రీనివాస్ ఈసారీ -మాస్, యాక్షన్ చాలా ఇష్టమని చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ, చేసిన సినిమాలన్నీ అదే యాక్షన్ కోణంలో ఉన్నా, అతన్ని రక్షించగలిగే సినిమా ఒక్కటీ దొరకలేదు. యాక్షన్, మసాలాకు ఎక్కువ అవకాశమున్న కథనే ఎంచుకుని చేసిన ‘కవచం’ సినిమా సైతం హీరోని ఏమాత్రం ఒడ్డెక్కించలేకపోయంది.

12/08/2018 - 20:27

ఇప్పుడంతా బయోపిక్‌లు అంటున్నారు, తీస్తున్నారు కానీ, ఒకప్పటి టంగుటూరి విజయచందరే బయోపిక్‌లను రక్తికట్టించాడని చెప్పాలి. ఆయన నటించిన చిత్రాలు తక్కువే కావచ్చు, కాని ప్రతి సినిమా ఆణిముత్యమే. ‘ఆంధ్రకేసరి’ సినిమాలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్రలో విజయచందర్ జీవించేశాడు. ఇక సాయిబాబా సినిమా సంగతి చెప్పనక్కర్లేదు.

12/01/2018 - 20:21

ఇంటా బయటా సెట్స్‌లోనూ కాస్త విరామం దొరికితే గలగలా మాట్లాడటం రష్మిక అలవాటుట! అంతేకాదు తను మాట్లాడుతుంటే పక్కనున్నవారు వౌనంగా ఊరుకున్నా, అక్కడనుంచి వెళ్లిపోయినా బాధపడుతుందట. ఒకసారి షూటింగ్‌లో అలవాటు ప్రకారం గలగలా మాట్లాడుతుంటే పక్కనున్న అందరూ లేచి దూరంగా వెళ్లిపోయారట. ఎందుకు వెళ్లిపోయారో తెలియక ఒక మూలకుపోయి ఏడుస్తూ కూచుందట రష్మిక. అప్పుడు అందరూ వచ్చి సరదాగా ఏడిపించాలని అలాచేసాం అన్నారట.

11/24/2018 - 20:18

ఇటీవల పవన్‌కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్‌కావడంతో తను స్థాపించిన జనసేన పార్టీకి పూర్తిగా పరిమితమై, ప్రజల సమస్యలు తెలుసుకొని, వారికి నిస్వార్ధంగా సేవచేయాలనుకోవడం నిజంగా శుభపరిణామం. ఎందుకంటే సినిమాలపరంగా పవన్‌కు సక్సెస్ శాతం తక్కువగా వుంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు, పవన్‌పై ఒక అవగాహన వచ్చింది. కాని ఎంతమంది పవన్‌కు మద్దతుగా నిలుస్తారో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది.

11/17/2018 - 19:54

ఒక ఛానల్ సినిమా కార్యక్రమంలో రాజవౌళి అంటే అమీర్‌కి ఎందుకంత కోపం? అన్న ప్రశ్నని పదేపదే ఫ్లాష్‌చేసి చివరకు చెప్పిందేమంటే- బాహుబలి-2 మనదేశంలో దంగల్‌ని మించిపోయి కలక్షన్ల రికార్డు సాధించినందుకట! ఆ కోపంతోనే అమీర్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రం నిర్మిస్తూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాడట! అని చెప్తూ తన అల్పబుద్ధిని బయటపెట్టుకుందా చానల్.

11/10/2018 - 20:24

‘అరవింద సమేత...’లో రాయలసీమను అవమానించే సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించి క్షమాపణ చెప్పాలంటూ విద్యార్థి పోరాట సమితి ధ్వజమెత్తింది. రాయలసీమ ఫ్యాక్షనిజంపై అరవింద మొదటి చిత్రం కాదు, చివరి చిత్రం కూడా కాబోదు. అలాగే తెలుగు పలుకుబడిలో యాసలు ప్రాంతాన్నిబట్టి మారుతాయి. వాటిని ఉపయోగించి హాస్య సన్నివేశాలు చిత్రిస్తే, ఆ ప్రాంత ప్రజల్ని అవమానించినట్టు కాదు.

11/03/2018 - 20:30

హక్కులు, రాయతీలు కోరుకుంటున్నంత నిక్కచ్చిగా చిన్న సినిమా దర్శక, నిర్మాతలూ బాధ్యతలు తీసుకుంటే బావుంటుంది. చిన్న సినిమాలను రక్షించండి అంటూ అప్పుడప్పుడూ గగ్గోలు వినిపిస్తూనే ఉంది. కానీ, ఎన్ని చిన్ని సినిమాలు ప్రేక్షకులను మైమరిపింప చేస్తున్నాయన్న లెక్కలు తీస్తే -లెక్కించడానికేమీ ఉండవు. వచ్చే సినిమాల్లో ఒకటీ అరా ఔరా! అనిపించడం తప్ప చాలా సినిమాలు ఏమాత్రం సినిమా ప్రామాణికత లేకుండానే వస్తున్నాయ.

10/27/2018 - 19:57

రామ్ సినిమాలు వరుసగా తనే్నస్తుండటంతో -హిట్టు కోసం పట్లు పడుతున్నాడు. కాని, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్నానన్న ఆలోచనకు రాకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే గతవారం విడుదలైన హలో గురు ప్రేమకోసమే చిత్రానే్న తీసుకుంటే, దర్శకుడు తెలివైనవాడు కనుక మామా అల్లుళ్ల కథల్ని అటు తిప్పి, ఇటు తిప్పి మళ్లీ మళ్లీ చేసేస్తున్నాడు. కనీసం రామ్ అయనా ఆలోచించాలిగా.

10/20/2018 - 23:14

అజ్ఞాతవాసి అపజయం తరువాత విజయం కోసం త్రివిక్రం సర్వశక్తులొడ్డిన చిత్రం అరవింద సమేత. అనుభవం లేని ఫ్యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెట్టాడు. సినిమా అతుకుల బొంత. త్రివిక్రమ్ మార్క్ సహజత్వం నిల్. పైగా తెలుగు ప్రేక్షకులను హింసించి కసి తీర్చుకున్న పగా ప్రతీకారాల జానర్. అతి హీరోయిజంతో ఇప్పటికే విసుగెత్తిన ప్రేక్షకుడిని తట్టిలేపి వెగటు పుట్టించిన చిత్రమిది. తమన్ నేపథ్య సంగీతం ఒక్కటే రిలీఫ్.

10/13/2018 - 20:15

ఆహా ఓహో అంటూ విజయ్‌ను ఆకాశానికి ఎత్తారు. ఎన్నికల మూడ్ వచ్చేసింది కనుక నోటా ఇరగదీదీస్తుందన్నారు. ఏమైంది? నోటాకు మాట లేదు. అర్జున్ రెడ్డి ఇమేజ్ మొత్తం ఆకాశానికి ఎగిరిపోయంది. అందుకే అంటారు పెద్దలు -ఎక్కడికక్కడే ఉండాలి తప్ప ఎగిరెగిరి పడకూడదు అని. ఏమైతేనేం.. విజయ్‌కు విషయం తెలిసొచ్చి ఉంటుంది. కొత్త అనుభవం అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఇమేజ్ అనేది ఒక సినిమాతో వస్తే మరో సినిమాతో పోవచ్చు.

Pages