S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

01/26/2019 - 22:32

గతంలో దక్షిణాది హీరోయిన్లు కొందరు పెళ్లయిన ‘పెద్దమనుషుల్ని’ ప్రేమించి రెండో భార్యగా సెటిలయ్యేవారు. అలా పెళ్లి చేసుకున్న తరువాతే -సావిత్రి జీవితం ఎంత ఘోరమైపోయిందో మహానటిలో చూశాం. శ్రీదేవి కూడా మిధున్ చక్రవర్తిని ప్రేమించి ‘ భార్యకు విడాకులిస్తే పెళ్లి చేసుకుందాం’ అన్న ప్రపోజల్ పెట్టిందట. అతడు వెనక్కి తగ్గగానే బోనీకఫూర్‌ని చేసుకుందన్న కథనాలు చదువుకున్నాం. చివరకు ఆమె మరణం మిస్టరీగా మారింది.

01/19/2019 - 20:52

వెనె్నల సినిమా సంచిక పాఠకులను అలరిస్తుంది. జనవరి 13నాటి వెనె్నలలో ‘రెండోవైపు చూడకు..’ అంటూ బాలయ్య ‘యన్‌టిఆర్- కథానాయకుడు’పై ప్రచురించిన కవర్ పేజీ కథనం బావుంది. ఆ తరంలోని యన్‌టిఆర్ అభిమానులకు తెలిసిన విషయాలను సైతం యథాతథంగా చూపించకుండా -సన్నివేశాలకు సినిమాటిక్ సుగర్‌కోట్ వేయడం బాధాకరం.

01/12/2019 - 21:08

కొంతకాలంగా గోళ్లుగిల్లుకుంటూ కూచున్న కాజల్ మళ్లీ పరుగందుకుంది. అటు సీనియర్ నటుడు కమల్‌హాసన్‌తో ఇటు కుర్ర హీరో బెల్లంకొండతో చాన్స్ కొట్టేసింది. మరో రెండు చిత్రాలు లైన్‌లో ఉన్నాయంటూ చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ, ఏం లాభం? చేస్తున్న సినిమాలు ఏమేరకు ఆమె కెరీర్‌కు ఉపకరిస్తాయో అర్థంకాని విషయమే. ఈమధ్యే వచ్చిన ‘కవచం’ పవర్ తగ్గిన పోలీస్ కథ. నటించడానికి ఏమీలేక గుంపులో గోపికైంది.

01/05/2019 - 20:49

సెకెండ్ ఇన్నింగ్స్‌లో కాస్త భిన్నమైన సినిమాలతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు సుమంత్ చేస్తున్నా, ఫలితమే దక్కడం లేదు. నాలుగేళ్ల గ్యాప్ తరువాత -వద్దవద్దనుకుంటూనే హారర్, థ్రిల్లర్ కథలపై పడిన సుమంత్, ఈమధ్యే చేసిన సుబ్రమణ్యపురం, ఇదం జగత్ చిత్రాలు కెరీర్‌కు కొత్త టర్న్ ఇవ్వలేకపోయాయ.

12/29/2018 - 19:45

కథ డిమాండ్ చేసింది కనుక లిప్‌లాక్‌కు ఓకే చెప్పానంటుంది ఓ హీరోయిన్. పాత్రోచితంగా లిప్‌లాక్ అవసరం కనుకే -యస్ చెప్పానంటుంది మరో హీరోయిన్. అధర చుంబనాలకు ‘డిమాండ్- సప్లయ్’ సిస్టమేమిటో ఆడియన్స్‌కి మాత్రం అర్థంకాదు. పాత్రో, కథో ముద్దు సన్నివేశాన్ని డిమాండ్ చేయడమేంటి? నాన్‌సెన్స్ కాకపోతే. సినిమా వ్యాపారం సాగాలన్న కమర్షియల్ ఐడియాలజీతో -రచయితో, దర్శకుడో కావాలనే ‘ముద్దు’ను చొప్పిస్తాడు.

12/22/2018 - 21:27

ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగంలో సినీరంగ విశేషాలు, మలిభాగంలో రాజకీయ విశేషాలు చూపిస్తామని యూనిట్ చెబుతోంది. అయితే యన్‌టీఆర్ సినీరంగ జీవితంలో చెప్పుకోదగ్గ మలుపులు, వివాదాలు లేవు. ఆయన చెప్పుకోదగ్గ చిత్రాలన్నీ అందుబాటులోనే ఉన్నపుడు -ఆయా పాత్రలను మళ్లీ బాలకృష్ణ పోషిస్తే చూడాలా? అన్న డౌట్లూ ఉన్నాయ.

12/15/2018 - 20:23

ప్రతి సినిమాకీ ముందు మీడియా వద్ద తన స్టామినా చెప్పుకునే కుర్ర హీరో బెల్లంకొండ సాయ శ్రీనివాస్ ఈసారీ -మాస్, యాక్షన్ చాలా ఇష్టమని చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ, చేసిన సినిమాలన్నీ అదే యాక్షన్ కోణంలో ఉన్నా, అతన్ని రక్షించగలిగే సినిమా ఒక్కటీ దొరకలేదు. యాక్షన్, మసాలాకు ఎక్కువ అవకాశమున్న కథనే ఎంచుకుని చేసిన ‘కవచం’ సినిమా సైతం హీరోని ఏమాత్రం ఒడ్డెక్కించలేకపోయంది.

12/08/2018 - 20:27

ఇప్పుడంతా బయోపిక్‌లు అంటున్నారు, తీస్తున్నారు కానీ, ఒకప్పటి టంగుటూరి విజయచందరే బయోపిక్‌లను రక్తికట్టించాడని చెప్పాలి. ఆయన నటించిన చిత్రాలు తక్కువే కావచ్చు, కాని ప్రతి సినిమా ఆణిముత్యమే. ‘ఆంధ్రకేసరి’ సినిమాలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్రలో విజయచందర్ జీవించేశాడు. ఇక సాయిబాబా సినిమా సంగతి చెప్పనక్కర్లేదు.

12/01/2018 - 20:21

ఇంటా బయటా సెట్స్‌లోనూ కాస్త విరామం దొరికితే గలగలా మాట్లాడటం రష్మిక అలవాటుట! అంతేకాదు తను మాట్లాడుతుంటే పక్కనున్నవారు వౌనంగా ఊరుకున్నా, అక్కడనుంచి వెళ్లిపోయినా బాధపడుతుందట. ఒకసారి షూటింగ్‌లో అలవాటు ప్రకారం గలగలా మాట్లాడుతుంటే పక్కనున్న అందరూ లేచి దూరంగా వెళ్లిపోయారట. ఎందుకు వెళ్లిపోయారో తెలియక ఒక మూలకుపోయి ఏడుస్తూ కూచుందట రష్మిక. అప్పుడు అందరూ వచ్చి సరదాగా ఏడిపించాలని అలాచేసాం అన్నారట.

11/24/2018 - 20:18

ఇటీవల పవన్‌కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్‌కావడంతో తను స్థాపించిన జనసేన పార్టీకి పూర్తిగా పరిమితమై, ప్రజల సమస్యలు తెలుసుకొని, వారికి నిస్వార్ధంగా సేవచేయాలనుకోవడం నిజంగా శుభపరిణామం. ఎందుకంటే సినిమాలపరంగా పవన్‌కు సక్సెస్ శాతం తక్కువగా వుంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు, పవన్‌పై ఒక అవగాహన వచ్చింది. కాని ఎంతమంది పవన్‌కు మద్దతుగా నిలుస్తారో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది.

Pages