S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

11/09/2019 - 20:02

గీతాంజలిని తొలిసారిగా సీతమ్మ పాత్రలోనే చూశాం. ఆ తరువాత కథానాయికగా, వాంప్‌గా, రెండో కథానాయికగా, ముఖ్యంగా అక్కినేని చెల్లెలిగా ఆమె నటించిన ప్రతి పాత్ర వైవిధ్యమే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె సినిమాలన్నీ అద్భుతం. ముఖ్యంగా ఏ పాత్రలో నృత్యం అయినా సరే అద్భుతంగా చేసి మెప్పించగల నటి గీతాంజలి. ఆమె తెలుగు ప్రేక్షకులను వదిలి దూర తీరాలకు వెళ్లడం, పాత సినిమా ప్రేక్షకులకు బాధాకరం.

11/02/2019 - 20:40

తమన్నా మీద నయనతార గుస్సా అట. ఎందుకంటే సైరాలో తన పాత్రకన్నా ఆమె పాత్రే ఎక్కువని. పైగా నయన్ కంటే తమన్నాకే ప్రశంసలు ఎక్కువగా అందాయంటూ ఓ పత్రిక కథనం. ఆ అభిప్రాయాన్ని బలపరుస్తూ తమన్నా కూడా ‘సీనియర్ నటి నయన్ ఉన్నా తనకే ప్రేక్షకామోదం లభించింది’ అంటూ డబ్బాకొట్టుకుంది. పైగా రామ్‌చరణ్ భార్య ఉపాసన తమన్నా నటనకు ఫిదా అయి గిఫ్ట్ ఇచ్చిందన్న వార్త ప్రచారం పొందింది.

10/26/2019 - 20:13

గోపీచంద్ ‘చాణక్య’ ఫరవాలేదు కానీ చాకచక్యం కరువైంది. థ్రిల్లర్ కథాంశం ఉండడంవల్లనే సినిమా కొంత విశ్రాంతి తర్వాతనుంచి బాగుందనిపించింది. సంగీతం ఆకట్టుకోలేదు. ఈమధ్య అన్ని సినిమాల్లో సాంగ్స్ ఉత్తేజపరిచేవిగా ఉండటంలేదు. మెలోడీ ట్యూన్స్‌ను ఉత్సాహపరిచేలా చేయటం లేదు. మెహరిన్ గ్లామర్‌గా బాగుంది. గోపీచంద్‌కు అప్పుడే ముసలి ముఖం ఛాయలు వచ్చేశాయ. అతను ఫిట్‌నెస్ మీద ముఖ వర్చస్సుమీద శ్రద్ధతీసుకోవాలి.

10/19/2019 - 20:33

మాతృదేవత అని ఓ సినిమా నాలుగు దశాబ్దాల ముందు వచ్చింది. అందులో హీరో బయటికి వెళ్తూ, నా మామూలు అని హీరోయిన్‌ని అడుగుతాడు. సీన్ ఛేంజవుతుంది. మరేదో చూపిస్తారు. వెంటనే పాత సీన్ వచ్చేస్తుంది. ముఖం నిండా సిగ్గుకప్పేయగా బుగ్గ తుడుచుకుని వెళ్తుంది కథానాయిక. ముద్దు ఆమె బుగ్గపై పెట్టడం చూపలేదు. కాని పెట్టినట్లు అర్ధమైంది. ఎక్స్‌ప్రెషన్ ద్వారా దాన్ని సజెస్టివ్ కిస్ అంటారు. ఆమె మహానటి.

10/12/2019 - 20:07

కమెడియన్ వేణుమాధవ్ ఆకస్మిక మరణం -చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయనలాగే చాలామంది తెలుగు కమెడియన్లు సంపూర్ణ జీవితాన్ని అనుభవించకుండానే -లైఫ్ స్క్రీన్‌నుంచి మాయం కావడం నిజంగానే విషాదభరితం. వేణుమాధవ్ కథనంలో ఎంతోమంది కమెడియన్స్‌ని గుర్తు చేయడం -నిజంగానే నివాళిగా అనిపించింది.

10/05/2019 - 20:31

చిరంజీవి తీసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాటిక్‌గా హిట్ కావొచ్చు. కానీ చారిత్రక కథగా ప్రచారం చేసుకుని ఇష్టారీతిన తీసిన సినిమాను గొప్ప చిత్రంగా పరిగణించలేం అంటోంది పూర్వతరం. తెల్లదొరల పాలనలో రైతుల నుంచి పన్నులు వసూలు చేయడానికి పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. వసూలు చేసిన శిస్తుల్లో కొంత ఉంచుకుని, కొంత బ్రిటీష్ పాలకులకు అందించేవారు. ఆ వ్యవస్థ నిజానికి బ్రిటీష్‌కు అనుకూలంగానే ఉండేది.

09/28/2019 - 20:15

వాల్మీకి బతికిపోయాడు. చివరి క్షణంలో గద్దలగొండ గణేశ్‌గా పేరు మార్చినా -వరుణ్‌తేజ్ మాస్ అప్పియరెన్స్‌తో ఆడియన్స్‌కి కనెక్టయ్యాడు. ఎస్టాబ్లిష్‌డ్ హీరో కనుక సరిపోయింది. అదే ఏ కొత్త హీరో సినిమా అయినా ఇలాంటి ప్రాబ్లెమ్ ఫేస్ చేసివుంటే, కచ్చితంగా ఢమాల్‌మనేది. పాత్రపరంగా వరుణ్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకోవాలి. జోడీగా కొద్దిసేపే కనిపించినా పూజాహెగ్దె యూత్‌ని మెప్పించగలిగింది.

09/21/2019 - 20:54

300 కోట్ల దోపిడీ. ఆరు హత్యలు. రెంటికీ కారకుడైన విలన్. వాడిపై -ఐదుగురు బాధిత మహిళల పగ. యాక్షన్ రివేంజ్‌కు -ట్రూ కాపీ రాసే నవలా రచయిత. ఈ ముడిసరుకుతో కథల్లుకోమంటే.. -అంటూ నానీస్ గ్యాంగ్‌లీడర్‌పై వెనె్నలలో రాసిన రివ్యూ భలే అనిపించింది. వెనె్నల రివ్యూలకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నది నిజం. ఆ క్వాలిటీని మెయన్‌టెయన్ చేస్తూ పత్రికలో ఇస్తున్న రివ్యూలు బావుంటున్నాయ.

09/14/2019 - 20:20

మైత్రీ మూవీ మేకర్స్ చాలా హిట్ చిత్రాలే తీసింది. తాజాగా విజయ్ దేవరకొండతో ‘హీరో’ చిత్రం తీయాలనుకుంది. ‘డియర్ కామ్రేడ్’ బకెట్ తనే్నయడంతో -హీరోని వెనక్కి లాగేసింది మైత్రీ మూవీస్. పూరీ వరుస ఫ్లాపులతో సతమతమవుతూ మహేశ్‌తో ‘జనగణమన’ ప్లాన్ చేసినా మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు పూరీకి.

09/07/2019 - 20:28

ఆహా ఓహో అంటూ వచ్చిన సాహో వారం తిరక్కుండానే చతికిలపడిపోయాడు. కోట్లకు కోట్లు వసూలు చేసినట్టు చెబుతున్న కబుర్లపైనా అనుమానాలు ముసురుతున్నాయ. అంత బడ్జెట్‌తో సాధారణ సినిమాలు తీసివుంటే -తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది కార్మికులకు పని దొరికేదో కదా. అయనా, హీరో గొప్ప కోసం తప్ప ఇండస్ట్రీ గురించి ఆలోచించేదెవరు?
-్భలే రాజు, లక్కవరం
గ్రేట్ కీర్తి

Pages