మీ వ్యూస్

ఆమె అంతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటా బయటా సెట్స్‌లోనూ కాస్త విరామం దొరికితే గలగలా మాట్లాడటం రష్మిక అలవాటుట! అంతేకాదు తను మాట్లాడుతుంటే పక్కనున్నవారు వౌనంగా ఊరుకున్నా, అక్కడనుంచి వెళ్లిపోయినా బాధపడుతుందట. ఒకసారి షూటింగ్‌లో అలవాటు ప్రకారం గలగలా మాట్లాడుతుంటే పక్కనున్న అందరూ లేచి దూరంగా వెళ్లిపోయారట. ఎందుకు వెళ్లిపోయారో తెలియక ఒక మూలకుపోయి ఏడుస్తూ కూచుందట రష్మిక. అప్పుడు అందరూ వచ్చి సరదాగా ఏడిపించాలని అలాచేసాం అన్నారట. ఆమె నవ్వేసింది. ఇంకా నయం, వీళ్లు నన్ను ఏడిపించి వేధించారంటూ మీటూకి ఎక్కి రచ్చ చేయలేదు!

-్ధర్మతేజ, గొడారిగుంట

బయోపిక్‌ల తలనొప్పి

బయోపిక్‌ల ప్రవచనాలు తలనొప్పిగా మారుతున్నాయ. హిందీలో డర్టీపిక్చర్‌తో ప్రారంభమైన ప్రస్థానం తరువాత మహానటి మంచి మార్కులు కొట్టేసినా, అదే అదనుగా ఒక బయోపిక్‌ను ముగ్గురు దర్శకులు తీయటం పరిపాటిగా మారింది. అందులో ముఖ్యంగా ఎన్‌టిఆర్‌కు సంబంధించి రాంగోపాల్‌వర్మ, జగదేశ్వర్‌రెడ్డి, క్రిష్ ఒకే వ్యక్తిపై చిత్రాలను రూపొందిస్తున్నారు. బయోపిక్‌ల యుగం తెలుగులో రాంగోపాల్‌వర్మతో ప్రారంభమైనది. రక్తచరిత్ర, వంగవీడు, సర్కార్ ఇత్యాది చిత్రాలను నిర్మించటం జరిగింది. తరువాత కొత్త కథలు దొరకక కొందరు బయోపిక్‌లను ఎంచుకుంటున్నారు. మంచిని ఆకాంక్షించి తీస్తే పర్వాలేదు. కొందరు రాజకీయ దురుద్దేశ్యంతో తీస్తున్నారు. అలాగే వైఎస్‌ఆర్ బయోపిక్, కెసిఆర్ బయోపిక్‌లు, జయలలిత బయోపిక్ ఇలా వ్యక్తిగత సంబంధమైనవి ప్రజల సహనాన్ని పరిక్షించే విధంగా ఉంటాయి.

-ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం

తమిళులా.. మజాకా

తెలుగు, తమిళ చిత్రం సర్కార్ విడుదలకాగానే జయలలిత అభిమానులు ఆగ్రహావేశాలతో జయలలిత, ఆమె ప్రభుత్వాన్ని కించపరిచే దృశ్యాల్ని తొలగించాలని ఆందోళనకు దిగారు. దర్శకునిపై కేసు పెట్టగానే ఆయన ఠారెత్తి ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నాడు. నిర్మాత భయపడి ఆ దృశ్యాల్ని తొలగించడానికి సిద్ధపడ్డాడు. సెన్సార్ పాస్ చేసిన దృశ్యాల్ని ప్రభుత్వం ఎలా తొలగిస్తుందంటూ రజని, కమల్, విశాల్ చిత్రానికి మద్దతు పలికినా లాభంలేకపోయింది. తెలుగు చిత్రం ఒకదానిలో బ్రాహ్మణులను కించపరిచే దృశ్యాల్ని తొలగింపజేయడానికి కొందరు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇదే తమిళ తంబిలకు మనకూ ఉన్న తేడా! వాళ్లు సాధించుకోగలిగారు. మనం చదికిలపడ్డాం!

- సుధీర్, శ్రీనగర్

లేదంటే.. అంతేసంగతులు

‘నేను నాలాగే ఉంటా. నచ్చినట్టే సినిమా తీస్తా. నచ్చకపోతే చూడకండి’ ఈ డైలాగ్‌తో మెదడులోకి రాంగోపాల్ వర్మ రావడం లేదూ. మొదట్లో మంచి సినిమాలే తీశాడు. తరువాత తిక్క ముదిరి ఫ్లాపులు మొదలెట్టాడు. వర్మ పని క్లోజ్- అనుకునేసరికి ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చాన్స్ వచ్చింది. తొలిరోజుల సృజనాత్మకతతో సినిమా తీస్తే సరే. ఎన్టీఆర్ అవసాన దశలో జరిగింది జరిగినట్టు తీస్తాంటున్న వర్మ, ఆ మాటమీద నిలబడితే బాలకృష్ణాస్ ఎన్టీఆర్‌కి బలమైన పోటీ ఇవ్వగలడు. లేకుంటే ఇంతే సంగతులు.

-బాజీరావ్, సికింద్రాబాద్

మనకంత సీన్ లేదు

‘నేల విడిచి నింగి కెగసి..’ ఫీచర్‌తో పాఠకుల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్లి ఓలలాడించారు, అయితే సైన్స్‌ఫిక్షన్‌లు చాలామట్టుకి తెలుగులో బాగా ఆడలేదు ఒకటీ, రెండు మినహా, అంతరిక్షం గురించి మన అవగాహన నిమ్మకాయంత. దానికి గుమ్మడి కాయంత కల్పనలు జోడించి సినిమా తీస్తే అసలుకన్నా కొసరు ఎక్కువై సినిమా ఢమాల్ అవుతుంది. మీరే చెప్పారు రాబోయే అంతరిక్ష సినిమాల టీజర్లు హాలీవుడ్ చిత్రాలను పోలి వుండి ఏమున్నది గర్వకారణం అనిపించాయని, హాలీవుడ్ చిత్రాల్లో సైన్సుతోబాటు యాక్షన్, థ్రిల్స్ కూడా మిళితం అయి ఉంటాయి. కనుక హిట్ అవుతాయి. కేవలం అంతరిక్ష చిత్రం అయితే ఆకర్షించదు.

- ప్రభాస్, గాంధీనగర్

తెలివైనది

మహానటి సావిత్రిగా కీర్తిసురేశ్ మహాకీర్తి ఆర్జించినా ఆమె మళ్లీ తెలుగులో నటించలేదు. అదీకాక ఎన్టీఆర్ బయోపిక్‌లో సావిత్రి పాత్ర పోషించడానికి నిరాకరించింది. తను నిరాకరించడానికి కారణం ఈమధ్యనే వివరించింది. అద్భుతం ఒక్కసారే జరుగుతుంది. మహానటి ఒక అద్భుతం. మళ్లీ అదే పాత్రను చేస్తే అద్భుతం రిపీట్ కాకపోవచ్చు. ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఒకే పాత్రను మళ్లీమళ్లీ చేసి పేరుచెడగొట్టుకోవడం ఎందుకు? అని ప్రశ్నించింది. సమంజసమే కదా!

-పండు రాజేశ్, ముదినేపల్లి

సర్కార్‌కు ఓటు

ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తమిళ యువ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం ఓటువిలువ తెలియజేసింది. ఎన్‌ఆర్‌ఐ అయిన విజయ్ భారత్‌కు వచ్చి ఓటేద్దాం అనుకుంటే ఆ ఓటు వేరేవ్యక్తి వెయ్యడం రాజ్యాంగం ప్రకారం ఆ ఓటువిలువ తెలియచెప్పేందుకు రీపోలింగ్ జరిపి ఆ ఓటు వేయించడం బావుంది. ఒకే ఓటుతో ఏమవుతుంది అని ప్రశ్నించేవారికి ఈ చిత్రంలో ఒకే ఒక ఓటుతో బిజెపి అధికారంను కోల్పోవడాన్ని, వాషింగ్టన్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ఒక ఓటు మెజారిటీతో గెలవడాన్ని ఉదాహరణగా చూపించడం బావుంది. ఈ చిత్రంలో సుందర రామస్వామిగా విజయ్ ముఖ్యమంత్రి కూతురుగా కుముదవళ్ళి పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటన హైలెట్‌గా చెప్పవచ్చు. ఎఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని పూర్తిగా రాజకీయ చిత్రంగా మలిచారు. మన దేశంలో ఓటుకునోటు అమ్ముకోకుండా ప్రజలకోసమే పనిచేసే వారికి ఓటువెయ్యాలని ఈ చిత్రం గుర్తుకుతెస్తుంది. ఈ చిత్రం రాజకీయ నాయకులకు చెంపపెట్టుగా చెప్తూ దర్శకుడికి హ్యాట్సాఫ్ చెబుతున్నాము.

- కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి