S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/23/2016 - 08:30

న్యూఢిల్లీ, మే 22: అసోంలో బిజెపి ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో భవిష్యత్తులో బిజెపి సొంతంగా ఎన్నికల్లో విజయం సాధించలేని రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడానికే తమ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు.

05/23/2016 - 08:07

ఢాకా, మే 22: ఊహించినట్లుగా బంగ్లాదేశ్ దక్షిణ తీరాన్ని తాకిన పెను తుపాను ‘రోను’ భారీ విధ్వంసాన్ని సృష్టించడమే కాకుండా కనీసం 24 మందిని పొట్టన పెట్టుకుంది. వందమందికి పైగా గాయపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం ఉదయం తుపాను బరిసాల్-చిట్టగాంగ్ మధ్య తీరాన్ని తాకినప్పుడు గంటకు 88 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.

05/23/2016 - 05:48

కాన్పూర్, మే 22: కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దుయ్యబడుతూ ఒక కుటుంబం (గాంధీ-నెహ్రూ) పట్ల ఆకర్షణ ముగిసిపోవడంతో కాంగ్రెస్ పార్టీ దానికి మూల్యం చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ బిజెపి కార్యకర్తల సమావేవంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అభివృద్ది నిరోధక ప్రతిపక్షంగా ప్రవర్తిస్తోందని, అయితే అది కూడా ఆ పార్టీకి ఏమాత్రం తోడ్పడడం లేదని అన్నారు.

05/23/2016 - 05:46

న్యూఢిల్లీ, మే 22: వాతావరణం, గాలి అనుకూలంగా ఉంటే 11టన్నుల రాకెట్ సోమవారం శ్రీహరికోట లాంచ్‌ప్యాడ్ నుంచి దూసుకుపోనుంది. భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో తొలిసారి పునర్వినియోగ అంతరిక్ష ప్రయోగ నౌక (ఆర్‌ఎల్‌వీ)ను తొలిసారి సోమవారం ప్రయోగించ బోతున్నారు.

05/23/2016 - 05:45

గౌహతి, మే 22: అసోంలో బిజెపి విజయ బావుటా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించిన సర్బానంద సోనోవాల్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా ఆదివారం జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సోనోవాల్‌ను పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బిజెపి కేంద్ర కమిటీ తరపున పరిశీలకుడుగా కేంద్ర మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ హాజరయ్యారు.

05/23/2016 - 05:44

న్యూఢిల్లీ, మే 22: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వన్ మాన్ షో’ నడిపిస్తున్నారనే విమర్శలకు ఆధారాలు లేవని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో సమాజంలో చీలికలు వచ్చాయన్న భావన కూడా పూర్తి అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.

05/23/2016 - 05:42

లక్నో, మే 22: ఉత్తరప్రదేశ్‌లో ఒకేరోజు జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాల్లో 10మంది దుర్మరణం చెందారు. మరో 18మందికి తీవ్ర గాయాలయ్యాయి. బరేలి, బండా, బల్లియా, షాజనాపూర్ జిల్లాల్లో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బరేలీ జిల్లాలోని బహేది ప్రాంతంలో కారు, ట్రాక్టర్ ట్రాలీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

05/23/2016 - 05:42

చెన్నై, మే 22: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎఐఎడిఎంకె అధినేత్రి జయలలిత సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయనుండటం ఇది వరుసగా రెండోసారి కాగా, మొత్తం మీద ఆరోసారి. ఈ కార్యక్రమంకోసం చెన్నైలోని మద్రాస్ యూనివర్శిటీ సెంటినరీ ఆడిటోరియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం ఈ ఆడిటోరియంలో జయలలిత 28 మంది మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

05/23/2016 - 05:40

జకార్తా, మే 22: ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం బద్దలై, దాన్నుంచి వెలువడిన లావాలో ఆరుగురు చనిపోయారు. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో ఉన్న సినాబంగ్ పర్వతం శనివారం బద్దలైందని.. దాదాపు మూడు కిలోమీటర్ల ఎత్తులో లావా వెలువడిందని.. సహాయకులకు ఆరు మృత దేశాలు లభ్యమైనట్లు ఇండోనేసియా జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ ప్రతినిధి సుతొపోపూర్వో నుగ్రోహొ తెలిపారు.

05/23/2016 - 01:21

న్యూఢిల్లీ, మే 22: నీటిని సంరక్షించుకుని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో తెలుగు రాష్ట్రాలు అద్భుతమైన ప్రాజెక్టులు చేపడుతున్నాయంటూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో సూక్ష్మ సేద్యం, తెలంగాణలో మిషన్ భగీరథ పథకాల గురించి ప్రస్తావించారు.

Pages