జాతీయ వార్తలు

జనానికి దూరం చేస్తున్న కాంగ్రెస్ చేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, మే 22: కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దుయ్యబడుతూ ఒక కుటుంబం (గాంధీ-నెహ్రూ) పట్ల ఆకర్షణ ముగిసిపోవడంతో కాంగ్రెస్ పార్టీ దానికి మూల్యం చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ బిజెపి కార్యకర్తల సమావేవంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అభివృద్ది నిరోధక ప్రతిపక్షంగా ప్రవర్తిస్తోందని, అయితే అది కూడా ఆ పార్టీకి ఏమాత్రం తోడ్పడడం లేదని అన్నారు. దీనివల్ల ప్రజలు ఆ పార్టీకి మరింత దూరం అయ్యారని, దాని మూలాలు మరింతగా తరిగి పోతున్నాయని అన్నారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసిన చోట్లకు ఆ పార్టీ వాళ్లు వెళ్తున్నారని, అలాంటి చర్యలు ప్రజలను పార్టీ వైపు ఆకర్షిస్తాయా? అని పరోక్షంగా జెఎన్‌యు ఘటనను ప్రస్తావిస్తూ జైట్లీ అన్నారు.
యుపిఏ పాలనలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నిర్ణయాలు తీసుకోవడంలో పెద్దగా పాత్ర లేక పోవడం వల్ల అవినీతి కేసులు పెరిగిపోయాయని ఆర్థిక మంత్రి అన్నారు. ‘యుపిఏ ఈ దేశానికి పదేళ్ల పాటు ఒకే ప్రధానిని అందించింది కానీ ఆయనకు ఎలాంటి హక్కులూ ఇవ్వలేదు. ఫలితంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే దశలో లేకుండా పోయింది. దీంతో అవినీతి పెరిగిపోయింది’ అని ఆయన అన్నారు. కాగా, దేశ రాజకీయ చర్చను అవినీతినుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్లిన ఘనత నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ‘ఇంతకు ముందు అవినీతి గురించే అందరూ మాట్లాడుకునే వారు. అయితే గత రెండేళ్ల కాలంలో ప్రధాని మోదీ భారత దేశ డిక్షనరీనుంచి అవినీతి అనే పదాన్ని తుడిచేశారు’ అని జైట్లీ అన్నారు. తాము తక్షణ నిర్ణయాలు తీసుకున్నామని, వాటిని అమలు చేశామని ఆయన అంటూ, చివరికి ప్రతిపక్షాలు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా భారత దేశం గత రెండేళ్లలో ప్రపంచంలోనే శరవేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా మారిందని ఆయన అంటూ, మారుతున్న పరిస్థితులను బట్టి చూస్తే మనం మరింత వేగంగా ఎదుగుతామని ఆశిస్తున్నామన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, పార్టీ కార్యకర్తలు అంత భావంతో పని చేస్తే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బిజెపి విజయపతాకాన్ని ఎగురవేస్తుందన్నారు. కార్యకర్తలంతా కూడా యుపి ఎన్నికలకోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాలని, వారంతా ప్రజల వద్దకు వెల్లి కేంద్రం చేసిన పనులను వారికి వివరించాలన్నారు. బిజెపి, దాని మిత్రపక్షాలు ఇప్పుడు 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయని ఆయన అంటూ, కర్నాటకలో కూడా పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సోనియాను తప్పుదారి పట్టిస్తున్నారు
కాంగ్రెస్ సీనియర్లపై కిశోర్ చంద్రదేవ్ ధ్వజం

న్యూఢిల్లీ, మే 22: కాంగ్రెస్ పార్టీలోని డజను మందికి పైగా సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తప్పుదారి పట్టిస్తున్నారని, వీరందరికీ కొనే్నళ్ల పాటు తప్పనిసరి సెలవు ఇచ్చి పార్టీకి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఉద్ఘాటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి ‘్భరీ శస్త్ర చికిత్స’ చేయాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం 2019 లేదా అంతకంటే ముందే అధికారాన్ని కోల్పోతుందని పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిశోర్ చంద్రదేవ్ జోస్యం చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తక్షణమే తేరుకోవాలన్నారు.
కపోతే పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా ఆవిర్భవిస్తాయని కిశోర్ చంద్రదేవ్ హెచ్చరించారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అకస్మాత్తుగా ఆవిర్భవించి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయాన్ని ఆయన ఉదహరిస్తూ, ప్రస్తుతం బలమైన ప్రాంతీయ పార్టీలేవీ లేని 15-20 రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం కావచ్చని భయాందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఎదురైన వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎంతో ఆత్మపరిశీలన చేసుకుందని, దీనిని కట్టిపెట్టి ఇకనైనా కార్యాచరణకు ఉపక్రమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రియాంక వస్తే బిజెపికి కష్టమే: రామ్‌దేవ్

న్యూఢిల్లీ, మే 22: ప్రియాంక గాంధీ గనుక కాంగ్రెస్ పార్టీ పగ్గలు చేపడితే వరస ఓటములతో అల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బిజెపికి గట్టిపోటీని ఇవ్వవచ్చని యోగాగురువు బాబా రాందేవ్ అభిప్రాయ పడ్డారు. ‘ప్రియాంక గాంధీ గనుక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే బిజెపి చాలా శ్రమించాల్సి ఉంటుంది’ అని నవభారత్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్‌దేవ్ అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీపట్ల తనకు పగ ఎందుకో కూడా రామ్‌దేవ్ వివరిస్తూ సోనియా గాంధీ నాకు చేసిన అవమానాన్ని నేను ఎప్పటికీ మరిచిపోను’ అని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రముఖ గాంధేయవాది అన్నాహజారే ఆందోళన చేస్తున్న సమయంలో తనపై జరిగిన పోలీసు దాడిని ప్రస్తావిస్తూ రామ్‌దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాఖండ్ సిఎం రావత్‌కు
సిబిఐ సమన్లు

న్యూఢిల్లీ, మే 22: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో తనకు అనుకూలంగా ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఆఫర్ చేస్తున్నట్లు చూపించే స్టింగ్ ఆపరేషన్‌పై దర్యాప్తుకు సంబంధించి ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) రావత్‌కు సమన్లు జారీ చేసింది. మంగళవారం హాజరు కావలసిందిగా రావత్‌ను కోరినట్లు సిబిఐ అధికార వర్గాలు తెలిపాయి. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన కేసును ఉపసంహరించుకుంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సిబిఐ గత వారం తిరస్కరించిన విషయం తెలిసిందే. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత నోటిఫికేషన్‌ను తిరస్కరించినట్లు సిబిఐ తెలియజేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై దర్యాప్తు జరపడానికి సిబిఐ గత ఏప్రిల్ 29న ప్రాథమిక దర్యాప్తు(పిఇ)ని రిజిస్టర్ చేసింది. మే 9న ప్రశ్నించడం కోసం రావలసిందిగా ఏజన్సీ రావత్‌కు సమన్లు జారీ చేసింది కానీ ఆయన మరికొంత సమయం కావాలని కోరారు. ఆ తర్వాత రావత్ అసెంబ్లీ బలపరీక్షలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. బలపరీక్షలో రావత్ విజయం సాధించిన తర్వాత ఈ నెల 15న రాష్టమ్రంత్రివర్గం సమావేశమై స్టింగ్ ఆపరేషన్‌పై సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశమైనందున సిబిఐ దర్యాప్తుకు బదులుగా ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. కాగా, ఉత్తరాఖండ్ హైకోర్టులో సైతం రావత్‌కు ఊరట లభించలేదు. ఈ దశలో సిబిఐ దర్యాప్తును కొట్టివేయడం సాధ్యం కాదని ఈ నెల 20న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.