జాతీయ వార్తలు

తెలుగుబాటే వెలుగుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: నీటిని సంరక్షించుకుని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో తెలుగు రాష్ట్రాలు అద్భుతమైన ప్రాజెక్టులు చేపడుతున్నాయంటూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో సూక్ష్మ సేద్యం, తెలంగాణలో మిషన్ భగీరథ పథకాల గురించి ప్రస్తావించారు. సూక్ష్మ సేద్యం వల్ల ఆంధ్రలో లక్షలాది ఎకరాల భూమికి నీటిని అందిస్తున్నారని, భూగర్భ జలాల కోసం అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారని మోదీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ జల వినియోగానికి నిలువుటద్దమన్నారు. కృష్ణా-గోదావరి నదీ జలాలను ఈ పథకం ద్వారా అద్భుతమైన రీతిలో సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలంలో ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించాలని.. అడవుల పరిరక్షణకు ఉద్యమంగా ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దేశంలో కరవు వాతావరణం.. కనీవినీ ఎరుగని వేడి గాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాటిని ఎదుర్కునేందుకు తగిన వ్యూహంతో చర్యలు తీసుకోవాలని మోదీ అన్నారు. గత పది రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న కరవు పరిస్థితులపై ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశాలు జరిపిన మోదీ, కొన్ని రాష్ట్రాలు కరవును ఎదుర్కోవటానికి మంచి చర్యలు తీసుకున్నాయని.. వీటిని దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలయ్యేలా చూడాలని ఆయన అన్నారు. ‘దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్నాయి. మనుషులైనా, పక్షులైనా, జంతువులైనా సరే.. అందరూ.. అన్నీ.. సంక్షోభంలో ఉన్నాయి. వాతావరణంలో మార్పు వల్లనే ఇదంతా జరుగుతోంది. అడవులు తగ్గిపోతున్నాయి. చెట్లను దారుణంగా నరుకుతున్నారు. మనుషుల వల్లే ఈ విధ్వంసం జరుగుతోంది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో వేడి కారణంగా అడవులు తగలబడ్డాయి. ప్రతి నీటి బిందువూ దేవుడు మనకిచ్చే ప్రసాదం. దాన్ని వృథా పోనివ్వవద్దు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పడే ప్రతి నీటి బొట్టునూ కాపాడేందుకు కృషి చేయాలి’ అని మోదీ అన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో కరవుతో పాటు ఇతర అంశాలను కూడా ప్రస్తావించారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు నగదు రహిత సమాజాన్ని తీసుకురావాలని తన ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని.. తాను చండీగఢ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నానన్నారు.

చిత్రం... ఆదివారం ఇరాన్‌లో దిగిన అనంతరం విమానాశ్రయంలో సైనిక వందనం స్వీకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ